సుపారీ కారులో వన్యప్రాణులను అత్యంత దగ్గరగా చూస్తుంటాం. పులులు, సింహాలను అలా దగ్గరగా చూడడం చాల థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అయితే అన్ని సందర్భాలలో అలా వెళ్లడం మంచిది కాదు. ఎందుకంటే అవి క్రూరమృగాలు వాటి కోరలు, గోళ్లతో ఏమైనా చేయగలవు. ఈ వీడియోలో సింహం అదే పని చేస్తుంది. అందులో ఒక సపరి కారు. దానికి రక్షణగా మరో రెండు వాహనాలు వచ్చాయి. ఆ కారుపైకి ఓ సింహం అమాంతం ఎక్కేసింది. అంతటితో ఆగకుండా దానికి తోడుగా మరో రెండు సింహాలను ఎక్కండి అని సైగ చేసింది. అంతే మరో రెండు సింహాలు కూడా కారెక్కాయి. వాటి బరువుకు కారు బానట్ వంగి పోయింది.

ఇక తోలుతూ ఎక్కిన సింహం కారు అద్దాన్ని కొరకడం మొదలుపెట్టింది. అనంతరం కారు డోర్ తీయడానికి ప్రయత్నించింది. కానీ కారు డోర్ తెరుచుకోలేదు. ఇక డ్రైవర్ కారును మెల్లగా వెనకకు నడిపాడు. దీంతో ఆ సింహం కూడా దిగిపోయి తన దారి తాను చూసుకుంది. కారు డోర్లు తెరుచుకోలేదు కాబట్టి సరిపోయింది.. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.