కొన్ని చోట్ల చిన్న చిన్న స్థలాలు ఉండడం వల్ల కారును పార్క్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఈ సమస్యకు ఆటోమొబైల్ దిగ్గజం ఆనంద్ మహేంద్ర సులువైన చిట్కా ఒకటి చెప్పారు. ‘ఆన్ ట్రాక్’ పార్కింగ్ పేరుతో మహేంద్ర సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో.. ఓ కారు ఇరుగ్గా ఉన్న పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించింది. ఇంతలో ఓ వ్యక్తి ఆ కారు ముందుకు ఓ ఇనుప ర్యాంపును తీసుకొచ్చి పెడతాడు. ఇక డ్రైవర్ కారును దానిపై ఎక్కిస్తాడు. అనంతరం కారు దిగిన డ్రైవర్, ఆ వ్యక్తి కలసి చక్రాలున్న ఆ ఇనుప ర్యాంపును కారుతో సహా గోడ వైపుకు నెడతారు.

ఇది చాలా తెలివైన ఆలోచన అని.. మన శక్తీ చూపించడానికి వీలు లేనప్పుడు ఏం చేస్తాం? అవరోధాలను ఎదుర్కోవడానికి తెలివైన మార్గాలను ఎంచుకోవడమే భారతీయుల ప్రతిభ అంటూ ఆనంద్ మహేంద్ర చెప్పారు. ఇక ఆనంద్ మహేంద్ర ట్విట్టర్ లో ఈ వీడియో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •