కరోనా వైరస్ రోజు రోజుకి బలపడటమే తప్ప బలహీన పడే సూచనలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి కనపడటం లేదు. కరోనా వైరస్ ను అంతమొందించడానికి చైనా ప్రభుత్వం మిలటరీని రంగంలోకి దింపి మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలన్ని స్తంభింపచేసి మొత్తం కరోనా వైరస్ పైనే పోరాటం చేస్తున్నా ఎలా వైరస్ ను అంతమొందించాలన్నది తెలియడం లేదు. మిలిటరీ దగ్గరుండి ఎవరకి వైరస్ సోకిందో వారిని అత్యవసరంగా హాస్పిటల్స్ కు చేర్చిడంతో పాటు ఎంతో సాహసహకారాలు అందిస్తుంది.

కానీ వైరస్ లో తగ్గుదల కనపడకపోవడంతో పాటు నిన్న ఒక్కరోజే 64 మంది చనిపోయారు. కరోనా వైరస్ వలన రెండు రోజుల క్రితం 59 మంది చనిపోతే నిన్న మరింత పెరుగుదల కనపడింది. ఇప్పటి వరకు కరోనా వైరస్ వలన చనిపోయిన వారు 425 మంది చనిపోయినట్లు అక్కడ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చిన వారు 2500 మంది ఉన్నట్లు, వైరస్ ను దాదాపుగా 17 వేల మందిలో గుర్తించినట్లు చెబుతున్నారు.

కరోనా వైరస్ కు సంబంధించి బ్యాంకాక్ కు చెందిన వైద్యబృందం మందుని కనిపెట్టిందని ఇప్పటికే థాయిలాండ్ లో దాదాపుగా 17 మందిలో ఎనిమిది మందికి నయం చేసి ఇంటికి పంపించినట్లు చెబుతున్నారు. ఆ మందు గురించి ఏమైనా చెబితే చైనాలో పరిస్థితి మెరుగుపడుతుందేమో చూడాలి. ప్రస్తుతానికి ఎయిడ్స్ కు సంబంధించిన మందుని ఉపశమనం కోసం వాడుతున్న సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  
  •  
  •