మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ నుండి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్. ఈయన రాజోలు నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఇక రాపాకను ఏ క్షణం అయిన పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. రాపాకతో పాటు ఆయన అనుచరులపై మలికిపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎమ్మెల్యే పేకాట ఆడుతున్న వారికి వత్తాసు పలికారని.. పోలీస్ స్టేషన్ పై దౌజన్యం చేసి ప్రభుత్వ ఆస్తిని నష్టపరిచారనే అభియోగాలున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్పి తెలియజేశారు. 15 మంది రాపాక అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎమ్మెల్యే ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

రెండు రోజుల క్రితం పేక ఆడుతున్న కొంతమంది స్థానికులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనితో వారికి మద్దతుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రాపాకకు, ఎస్సైకి మధ్య గొడవ జరిగింది. దీనితో జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ మీద రాళ్లు విసిరారు. దీనితో చట్ట ప్రకారం కార్యకర్తలపై, ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు మలికిపురం మండలంలో పోలీసులను భారీగా మోహరించారు. ఈ ఘటనకు సంబందించి ఎమ్మెల్యే రాపాకను ఏ క్షణం లోనైనా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •