గత పదేళ్లుగా అక్రమాస్తుల కేసులను ఎదుర్కొంటున్న జగన్ పదహారు నెలలు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఇంకా ఆ కేసులు ఒక కొలిక్కి రాకపోగా ఇంకా విచారణలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే జగన్ తాను సీఎంగా ఏడు నెలలు క్రితం ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటిసారి గత శుక్రవారం కోర్టుకి హాజరయ్యాడు. ఈరోజు జగన్ కోర్టుకు హాజరయ్యే దానిలో భాగంగా సిబిఐ కోర్టు మినహాయింపునిచ్చింది.

ఇక జగన్ తన అక్రమాస్తుల కేసులకు సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్లు అన్నింటిని కలిపి విచారించాలని గతంలో జగన్ ధాఖలు చేసిన పిటిషన్ కోర్టు కొట్టేసింది. ఇక సీబీఐ కేసుల విచారణతో పాటు ఈడీ కేసులను కూడా ఎదుర్కొంటున్న జగన్ మరో పిటిషన్ ధాఖలు చేసి సిబిఐ కేసుల విచారణ పూర్తయిన తరువాతే ఈడీ కేసుల విచారణ కొనసాగించాలని కోరినా కోర్టు అంగీకరించలేదు. దీనితో జగన్ కు కాస్త ఇబ్బందికర పరిస్థితులనే చెప్పుకోవచ్చు. సీఎం అయిన తరువాత కూడా జగన్ కు కోర్టులు, కేసులు తప్పకపోవడంతో వైసీపీ నేతలు అందరిలో కాస్త టెన్షన్ నెలకొన్నా తమ నేత ఎవరి కాళ్ళు పట్టుకునే రకం కాదని, దైర్యంగా కేసులు ఎదుర్కొంటున్నాడని చెప్పుకొస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •