పేరులో మాత్రం గాంధీ అని పెట్టుకొని బయటకు నీతి వ్యాఖ్యలు చెబుతూ సత్యహరిచంద్రుడిలా బిల్డ్ అప్ ఇచ్చి… తాను ఒక నీతిమంతుడుననట్లు అవినీతి చేసే వారి భరతం పడతానని కోతలు కోసే కోతల రాయుడు అడ్డంగా వందల కోట్ల రూపాయలతో సీబీఐ రైడ్స్ లో దొరికిపోయాడు. సీబీఐ రైడ్స్ ప్రకారం రెండు, మూడు కోట్ల అక్రమాస్తులు అంటున్నా… మార్కెట్ విలువ ప్రకారం దాదాపుగా 250 కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఆర్జించడాని తెలుస్తుంది.

చంద్రబాబు నాయుడుకి సన్నిహితుడిగా పేరున్న బొల్లినేని శ్రీనివాస గాంధీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ లో పనిచేసేవాడు. అప్పట్లో సుజనా చౌదరి మీద ఈడీ నమోదు చేసిన కేసులను విచారించే వారిలో ఈ బొల్లినేని శ్రీనివాస్ గాంధీ కూడా ఒకడు. సుజనాచౌదరి మనీ లాండరింగ్ కేసుని చూసి చూడనట్లు వ్యవహరించాడని ఆర్ధిక శాఖకు కూడా పిర్యాదులు అందాయట.

చంద్రబాబు నాయుడుకి బినామీగా చెప్పుకొనే సుజనా చౌదరి కేసు అంటే… ఇక బొల్లినేని గాంధీ… ఆ కేసు ఎంతలా నీరు కార్చాలో అంతలా కారుస్తాడన్న విషయం తెలిసిందే. అప్పట్లో జగన్ కేసులపై కత్తి కట్టి ఈడి అభియోగాలపై విచారణ జరిపేవారిలో ఈ బొల్లినేని శ్రీనివాస్ గాంధీ ప్రముఖ పాత్ర పోషించాడు. చంద్రబాబు నాయుడుతో ఉన్న సాన్నిహిత్యంతో అప్పట్లో పచ్చ మీడియాకు కూడా ఉన్నది లేనట్టు… చెప్పడంలో కూడా ఈ బొల్లిననేని ప్రముఖ పాత్ర పోషించాడు.

ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ… వేల రూపాయల జీతం తీసుకునే బొల్లినేని తన కూతురు ఎంబీబీఎస్ సీటు కోసం 70 లక్షల రూపాయలు కట్టాడట.  హైదరాబాద్ తో సహా పలు చోట్ల స్థలాలు, అమరావతి రాజధాని ప్రాంతంలో భూములతో పాటు ఎన్నో ఆస్తులు కూడబెట్టాడు. అందరి బాగోతాలు బయటపెట్టి… చంద్రబాబు నాయుడు బినామీలుగా పేరుగాంచిన వారి కేసులు మాత్రం తొక్కిపెట్టే బొల్లినేని చివరకి సీబీఐకు అడ్డంగా దొరికిపోయాడు.
  •  
  •  
  •  
  •  
  •  
  •