సీఎం జగన్ గత పదేళ్లుగా అతడు పడిన కష్టాలు మన దేశంలో ఏ రాజకీయ నాయకుడు తన జీవితంలో పడి ఉన్న దాఖలాలు లేవు. అలంటి జగన్ తాను ఎంతో ఓర్పుగా ఎంతమంది అతడిపై దాడి చేస్తున్నా, ముప్పేట కేసులతో ఇబ్బంది పెడుతున్న ఎప్పుడు నవ్వుతు తనపని తాను చేసుకుంటూ ముందుకు వెళుతూ చివరకు విజయం సాధించాడు. చివరకు సూపర్ డూపర్ విజయం తో ఏపీ సీఎంగా అధికారంలోకి వచ్చాడు. కానీ ప్రతిపక్ష పార్టీగా వైసీపీలో నుంచి ఎమ్మెల్యేలను, ఎంపిలను లాక్కుని అప్పట్లో చంద్రబాబు నాయుడు చాలా ఇబ్బంది పెట్టాడు.

జగన్ కు ఇప్పటికి అలాంటి బాధలు తప్పడం లేదు. అద్భుతమైన మెజారిటీతో ఎన్నికలలో విజయం సాధించినా ఇంకా జగన్ కు పంటి కింద రాళ్ళలా వైసీపీ పార్టీలో ఉన్నారు. నర్సాపురం ఎంపీగా చివరి నిమిషంలో వైసీపీ పార్టీలోకి వచ్చి కాళ్ళా వెళ్ళా పడి జగన్ దగ్గర నుంచి సీటు సంపాదించి గెలిచిన రఘురామకృష్ణం రాజు గెలిచినా తరువాత తన వక్రబుద్ధిని చూపిస్తూ వైసీపీ పార్టీకి కొరకరాని కొయ్యగా మారి సీఎం జగన్ తో పాటు అనేకమంది నాయకులపై అనేక విమర్శలు చేస్తున్నాడు.

వైసీపీ కార్యకర్తలు కూడా అధికారంలో ఉండి కూడా ఇలాంటివారిని ఏమి చేయలేకపోయితున్నామా అనేలా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సీఎం జగన్ మాత్రం ఏది హడావిడిగా నిర్ణయాలు తీసుకునే తత్వం కాదు. సమయం కోసం వేచి చూసి దెబ్బకొట్టేసే వ్యక్తి. రఘురామకృష్ణం రాజుకి సంబంధించి 2019 ఫిబ్రవరిలో సిబిఐ కేసు నమోదు చేసింది. అతడు బ్యాంకులకు డబ్బు ఎగొట్టిన కేసులతో అతడిపై ఇప్పుడు అనూహ్యంగా మరొకసారి సిబిసై దాడులు చేయడంతో అతడు ఉలిక్కిపడ్డాడు. సీఎం ఈమధ్య ప్రధాని మోదీని కలవడానికి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసింది. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన సందర్భంలో కదిలించిన డొంక ఇప్పుడు రఘురామకృష్ణం రాజు పీకల మీదకు వచ్చినట్లు తెలుస్తుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు కంసర్ఫియం పిర్యాదు మేరకు రఘురామకృష్ణం రాజుపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అతడు బ్యాంకుల నుంచి 826.17 కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు సిబిఐ లేటెస్ట్ ప్రెస్ నోట్ లో పేర్కొంది. అయితే ఇదంతా జరగడానికి జగన్ ఢిల్లీ పర్యటనకు కారణమేమిటంటే, ఢిల్లీ వెళ్లిన సమయంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు చైర్మన్, సిఇఓ జగన్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సీఎంలతో బ్యాంకుల చైర్మన్ లు మర్యాదపూర్వకముగా కలసి తమ బ్యాంకులను ఆయా రాష్ట్రాలలో అభివృద్ధి చేసుకోవడానికి సహాయం అడుగుతారు.

అలానే పంజాబ్ నేషనల్ బ్యాంకు వారు సీఎం ను కలిసిన కొన్ని రోజులకే రఘురామకృష్ణం రాజుపై దాడులకు పాల్పడటం చూస్తుంటే సరిగ్గా సీఎం జగన్ జగన్ ఎక్కడ కొడితే దెబ్బ గట్టిగానే తగులుతుందో చూసి దెబ్బ వేసేయడంతో ఇప్పుడు రఘురామకృష్ణం రాజు నోటా మాట రాక, ఇన్నిరోజులు భుజాన వేసుకున్న పచ్చ మీడియా అతడి గురించి ఒక్క పాజిటివ్ న్యూస్ కూడా రాయడం లేదు. సిబిఐ దాడుల నేపథ్యంలో రఘురామకృష్ణం రాజు అడ్డంగా ఇరుక్కుపోయినట్లే అని చెప్పుకోవచ్చు.