నిజంగా ఇదే పరిస్థితులలో కనుక ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ ఉంటే, తక్షణం అమరావతి కోసం రాజీనామా చేసి ఎన్నికలకు సై అనేవాడు. కానీ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధినేత మాత్రం ఆ పనిచేయలేకపోతున్నాడు. చంద్రబాబు నాయుడు తన బినామీల కోసం అమరావతి అనే పేరుతో ఒక భ్రమరావతిని ఏర్పాటు చేసి ఏపీ ప్రజల నోట్లో మట్టికొట్టాలని చూస్తే జగన్ సర్కార్ వచ్చి మూడు రాజధానుల పేరుతో చంద్రబాబు నాయుడుతో పాటు అతడి బినామీల నోట్లో మట్టికొట్టి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు . దీనితో నిన్న గవర్నర్ మూడు రాజధానుల బిల్లుపై సంతకం చేసి ఆమోదముద్ర వేసిన దగ్గర నుంచి టీడీపీ నేతలు మీడియా పులులుగా విరుచుకుపడుతున్నారే తప్ప ఒక్కరు రాజీనామా చేయడానికి ముందుకు రావడం లేదు.

చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేలకు రాజీనామా చేయమని చెప్పారని తాము సిద్ధమని ఎమ్మెల్యేలు చెప్పినట్లు పచ్చ మీడియాలో వార్తలు వచ్చినా మొత్తం దానికి రివర్స్ లో వ్యవహారం జరుగుతున్నట్లు కనపడుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే చంద్రబాబు ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా ఆసక్తి చూపడం లేదట. మరికొందరు అయితే అమరావతిలో ఏముందని రాజీనామా చేయాలని, గత ఐదేళ్లు ఏపీ ప్రజలను నమ్మబలికి బినామీలను అడ్డంపెట్టుకొని వందల ఎకరాల భూములు తక్కువరేటుకి చేజిక్కించుకొని డబ్బు దోచుకుంటే ఇప్పుడు అమరావతి కోసం రాజీనామా చేస్తే తాము కూడా గెలవమని, అసలు అమరావతి ఉద్యమం అసలు ఎవరు నమ్మే పరిస్థితి లేదని, అమరావతిలో ఉన్న బినామీ బ్యాచ్ తప్ప ఎవరు హడావిడి చేయడం లేదని కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారట.

మరికొందరైతే ముందు మీరు హైదరాబాద్ వదిలి అమరావతి రావాలని, ముందుగా మీరు మీ ఎమ్మెల్యే పోస్టుకి, మీ కొడుకు లోకేష్ బాబు ఎమెల్సీకు రాజీనామా చేసి ప్రజా తీర్పుకి వెల్లాలని ఆ తరువాత తమ రాజీనామాల సంగతి ఆలోచిస్తామని, ఐదేళ్ల పదవిని తాము ఏడాదిలోనే ముగించుకుని ఆలోచనలో లేమని నేరుగా చెప్పేయడంతో తనకే ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతారా అని చంద్రబాబు ఆవేదన చెందుతున్నారట. చంద్రబాబు మాట కనీసం కృష్ణ, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు కూడా వినే పరిస్థితులలో లేరట. అందరూ కూడా రాజీనామా చేసి ఎన్నికలంటూ వెళితే ఓడిపోవడం ఖాయమని, జగన్ సర్కార్ ప్రకటించిన మూడు రాజధానులతో అన్ని ప్రాంతాల ప్రజలు ఆనందంతో ఉన్నారని, ఒక్క చంద్రబాబు నాయుడు అండ్ అతడి బినామీ బ్యాచ్ తప్ప అని మాట్లాడుకుంటున్నారట.