కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పింఛన్ విధానంలో పలు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఈ విధానం 2004 జనవరి 1 నుంచి అమలులో ఉంది. ఆ తరువాత ఉద్యోగాలలో చేరిన వారికి ప్రస్తుతం జాతీయ పింఛన్ విధానం అమలులో ఉంది. కానీ ఈ నిబంధనల పట్ల కొంతమందికి స్వల్ప ఊరట కలిగించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎవరైతే 2003 డిసెంబర్ 31 నాటికీ నియామక పరీక్షలు వెల్లడై ప్రక్రియ పూర్తయినా పరిపాలన కారణాలతో చేరిక ఆలస్యమైనా వారికి కొత్త పింఛన్ విధానం కాకుండా పాత పింఛన్ నిబంధనలను వర్తింప చేయనున్నట్లు తెలియచేయడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అర్హత పరిధిలోకి వచ్చే వారు 2020 మే 31 లోగా పిన్షన్ విధానంలో ఆప్షన్ ఎంచుకోవాలని సూచించింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •