కేంద్ర ప్రభుత్వం చైనాకు మరో భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే అనేక చైనా యాప్లను నిషేధించిన కేంద్రం.. తాజాగా పబ్జిని కూడా నిషేధించింది. పబ్జితో పాటు 118 చైనా యాప్ లను కేంద్రం నిషేధం విధించింది. ప్రభుత్వ నిర్ణయంతో గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ప్లే స్టోర్ నుండి పబ్జిని తొలగించారు. పబ్జితో పాటు బైడు, క్యామ్ కార్డు, విచాట్ రీడింగ్, టెన్సెన్ట్ వీన్, లైఫ్ ఆఫ్టర్, సైబర్ హంటర్ వంటి యాప్ లను కూడా ప్రభుత్వం నిషేధించింది.

ఇక పబ్జి, పబ్జి లైట్ యాప్లను ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. వీటికి మనదేశంలో 50 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ఇక సరిహద్దుల్లో డ్రాగన్ దూకుడుతో ఉద్రిక్తత నెలకొన్న క్రమంలో కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తిరుమల వీధుల్లో మరోసారి చిరుత సంచారం..!