ప్రపంచంలో టెక్నాలజీ పరంగా చైనా దేశం ముందు వరుసలో ఉండటానికి ఎప్పటికప్పుడు తన ప్రయత్నాలు చేస్తుంటుంది. టెక్నాలజీ పరంగా కొత్త కొత్త ఫోన్ లతో పాటు మన దేశంలో చైనా మొబైల్స్ సంఖ్య రోజు రోజుకి పెరగడమే కాకుండా తమ ఉత్పత్తి కంపెనీలు భారత్ మార్కెట్ పై దృష్టి పెట్టడంతో మంచి లాభాలను గడిస్తున్నారు. ఇక మన దేశంలో ఇంకా 5G సేవలే అందుబాటులోకి రాలేదు. మనం ఇంకా 4G సేవలతోనే ఆహా ఓహో అనుకుంటున్నాము. ఇంకా చెప్పాలంటే మన దేశంలో చాల ప్రాంతాలలో ఇంకా 4G సేవలు అందుబాటులో లేవు.

కానీ చైనా లాంటి సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంలో 5G సేవలు ఇప్పటికే మొదలవ్వడంతో పాటు అప్పుడే 6G సేవలకు సంబంధించి పరిశోధనలను మొదలు పెట్టింది. దీని కోసం ఇప్పటికే రెండు కార్యాలయాలను తీసుకున్నట్లు చైనా మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. అయితే 5G సేవలు చేపట్టిన కొద్ది రోజులకే ఈ చర్యలు చేపట్టడం గమనార్హం. దీనితో ప్రపంచశక్తిగా ఎదగడానికి చైనా లక్ష్యంగా కనిపిస్తుంది.