చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా దాటికి ఇప్పటికే 2700 మంది మృతి చెందారు. ఇక 80000 మంది కరోనా భారిన పడ్డారు. ఇక తాజాగా కరోనా వ్యాధిగ్రస్థుల్లో మనోధైర్యాన్ని నింపడానికి ఇద్దరు వైద్య సిబ్బంది సంతోషంగా డాన్స్ చేశారు. చికిత్య కోసం అన్హుయి మెడికల్ కాలేజీలో చేరిన వారిలో ఆరుగురి ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈ వైరస్ నుండి కోలుకుంటుండడంతో సంతోషం వ్యక్తం చేసిన ఇద్దరు వైద్య సిబ్బంది ఆసుపత్రి నుండి కిందకి దిగుతూ లిఫ్ట్ దగ్గర సంతోషంగా డాన్స్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •