అక్కినేని నాగ‌చైత‌న్య, స‌మంత జంటగా ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మజిలీ’ (వర్కింగ్ టైటిల్). తాజాగా ఈ సినిమా వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని, ఈ నెల 26 నుండి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టుకుంది. పెళ్లి తర్వాత చైతు, సామ్ కలసి నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. నవంబర్ 23 చైతన్య పుట్టిన రోజు కావడంతో ఆయనకు విషెస్ తెలుపుతూ చైతు లుక్‌తో పోస్టర్ ను వదిలింది సినిమా యూనిట్. ఈ సినిమాలో దివ్యాంశ కౌషిక్ సెకెండ్ హీరోయిన్ గా నటిస్తోంది. చైతూ, సమంత కాంబోలో ఇది నాలుగో సినిమా. ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ చివరి నాటికి కంప్లీట్ చేసి, ఫిబ్రవరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
  •  
  •  
  •  
  •  
  •  
  •