వరుస ప్లాప్ లతో సతమత మవుతున్నాడు యంగ్ హీరో నాగ చైతన్య. చైతు నటించిన సినిమాలు ఈ మధ్యకాలంలో వరుస పరాజయాలు కావడంతో కొంత డైలమాలో పడ్డ చైతు.. సమంత తో కలిసి ‘మజిలీ’ చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో చైతు-సమంత భార్య భర్తలుగా నటిస్తున్నారు.

ఇక ఈ మూవీ తర్వాత చైతు యూవీ క్రియేషన్స్ మూవీలో నటించబోతున్నాడు. ఈ సినిమాకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకటాద్రి ఎక్సప్రెస్, ఎక్సప్రెస్ రాజా వంటి హిట్ చిత్రాలని తీసాడు గాంధీ. కాగా ఈ సినిమాలో లక్కీ హీరోయిన్ అయిన నిత్యా మీనన్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారు. వరుస ఫ్లాప్‌లలో ఉన్న హీరోలు నిత్యాతో కలిసి నటిస్తే సక్సెస్ వస్తుందన్న సెంటిమెంట్‌ ఇండస్ట్రీలో ఉంది. అందుకే చైతూ సినిమా కోసం నిత్యాను తీసుకునే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నారు.
  •  
  •  
  •  
  •  
  •  
  •