అసలే వరుసపెట్టి నాయకులు తెలుగుదేశం పార్టీని వీడుతుంటే మరో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారట. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గత కొంత కాలం నుండి టీడీపీని వీడతారని ప్రచారం జరుగుతుంది. ఎన్నికల తర్వాత టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలలో యాక్టీవ్ గా ఉండడం లేదు. స్వయానా చంద్రబాబు ఆదేశాలను కూడా ఈ నేత పట్టించుకోవడం లేదంటే టీడీపీని వీడడం ఖాయంగా కనిపిస్తుదంటున్నారు.

విశాఖలో జనసేన పార్టీ నిర్వహించిన లాంగ్ మార్చ్ కార్యక్రమానికి చంద్రబాబు ఆదేశించిన గంటా శ్రీనివాసరావు వెళ్ళలేదు. చిరంజీవి అప్తుడుగా పేరు తెచ్చుకున్న గంటా.. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ఆ కార్యక్రమానికి వస్తారని అందరు భావించారు. ఆదివారం విశాఖలో అందుబాటులోనే ఉన్నాసరే ఆయన కార్యక్రమానికి రాకపోవడం చర్చకు దారితీసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాకపోయినా అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు ఆ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

సోమవారం కూడా గంటా శ్రీనివాసరావు విశాఖలోనే ఉన్నపటికీ చంద్రబాబుకి కానీ, టీడీపీ నేతలకు కానీ గంటా అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గంటా.. ఏ పార్టీలో చేరుతారన్న విషయం ఆసక్తికరంగా మారింది. వైసీపీ వచ్చే ఛాన్సులు ఎక్కువుగా ఉన్నాయని, అలాగే బీజేపీ నేతలతో కూడా ఆయన టచ్ లో ఉన్నారని తెలుస్తుంది. ఈ విషయంపై రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతుంది.