1994లో ఎన్టీఆర్ మూడవసారి సీఎంగా ప్రమాణం చేసిన తరువాత కొన్ని నెలలకే ఎన్టీఆర్ చేతిలో నుంచి పగ్గాలు చంద్రబాబు నాయుడు చాకచక్యంగా లాక్కుని తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తి బాధ్యతలు, పార్టీపై పట్టు అన్ని తన గుప్పిట్లోనే ఉంచుకున్నారు. ఇక తరువాత కాలంలో ఎన్టీఆర్ కొడుకులు, ఎన్టీఆర్ సన్నిహితులు పార్టీలో తమకు ఏదో ఒక పదవి అప్పగించినా చాలులే అనే పరిస్థితికి చంద్రబాబు తీసుకువచ్చి టిడిపిని తన హస్తగతం చేసుకున్నాడంటే చంద్రబాబు గేమ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో అర్ధమవుతుంది.

2004 ఎన్నికలలో రాజశేఖర్ రెడ్డి దెబ్బకు అధికారాన్ని కోల్పోయిన చంద్రబాబు పది సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండి, 2014 ఎన్నికలలో విభజించిన రెండు తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్, ప్రధాని మంత్రి మోదీ సహాయంతో రెండు శాతం ఓట్ల తేడాతో గద్దెనెక్కారు. చంద్రబాబు నాయుడు ప్రతి సారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది తానేనని, ఇప్పుడు అమరావతిని కూడా ప్రపంచ పటంలో పెట్టబోతునందుకు గర్విస్తున్నానని కబుర్లు చెబుతూ నాలుగునర్ర సంవత్సరాలు గడిపేశారు.

Chandrababu Naidu

చంద్రబాబు అమరావతిని ప్రపంచపటంలో పెడతారో లేదో తెలియదు గాని, అమరావతి రైతుల దగ్గర నుంచి దాదాపుగా 35 వేల ఎకరాలు లాక్కుని వారి పొట్ట అయితే గట్టిగానే కొట్టారు. ప్రభుత్వం లాక్కున్న ఆ భూమి ఏడాది కాలం పాటు పంటలు పండుతూ ఎంతో సారవంతమైన భూమి. కానీ చంద్రబాబు చెబుతూ అభివృద్ధి చేసేటప్పుడు కొంత మంది ప్రజలు కష్టాలు పడాలని, నా కోసం మీరంతా కష్టాలు పడలేరా అంటూ, భూములు ఇవ్వని రైతులను పోలీస్ స్టేషన్ లో చిత్ర హింసలకు గురి చేస్తూ కొన్ని పొలాలు లాక్కున్న సంఘటనలు కూడా ఉన్నాయి.

ఇక 2019 ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ పరిస్థితి చూస్తే సెక్రెటరేట్ పేరుతో 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన బిల్డింగ్ చిన్న వానకే మంత్రుల చాంబర్స్ లోకి నీరు కారటంతో చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఇంత గొప్పగా ఉంటుందా అని ప్రజలు చర్చించుకునేలా ప్రచారం జరుగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు దొరికిన కాడికి దొరికినట్లు దోచుకోవడం ఇసుక, మట్టి కుంబకోణాలలో దేశంలోనే ఏప్రభుత్వం చేయనంత అవినీతికి పాల్పడటంతో పాటు, అద్న్హులో సంపాదించే ప్రతి రూపాయితో సగం పార్టీలోని ముఖ్యనేతకు చేరడంతో ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ పరిణామాలు ఎన్నికలు లేనప్పుడు ఎవరు అడగారన్న ధీమాతో ఇన్ని తప్పులు చేసిన ప్రభుత్వ పెద్దలు ఎన్నికలు దగ్గరకొచ్చే సరికి తాను అభివృద్ధి చేస్తుంటే ఎమ్మెలేయేలు ఏవినీతికి పాల్పడి పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని, చంద్రబాబు నాయుడు తెలియచేస్తున్నారు.

cbn lokesh

ప్రతిపక్ష సభ్యులు గత నాలుగు సంవత్సరాలుగా ఎక్కడ అవినీతి జరిగితే దానిపై ఎంక్వయిరీ వేసి ప్రభుత్వం చిత్త శుద్ధి నిరూపించుకోవాలని చెబితే పట్టించుకోకుండా ఎన్నికలప్పుడు చంద్రబాబు తన మీదకు ఎలాంటి ఆరోపణలు రాకుండా ఎమ్మెల్యేల పైకి నెట్టడం చూస్తుంటే ఇప్పటికే జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప యాత్రకు వస్తున్న జనాన్ని చూసి వచ్చే ఎన్నికలలో తమకు ప్రతిపక్ష హోదా ఖాయమని, కానీ తాను అభివృద్ధి చేయాలనీ ఎంత ప్రయత్నించినా… ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడి మరో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని కోల్పోయానని తన పచ్చ మీడియాతో ప్రచారం మెల్లగా మొదలు పెట్టేపనిలో పడ్డారు. అవినీతి చేసేటప్పుడు గుర్తు రాని అభివృద్ధి, ఎన్నికలప్పుడు మాత్రం అభివృద్ధి గుర్తుకు వస్తుంది.

హైదరాబాద్ ను ప్రపంచపటంలో పెట్టినట్లు అమరావతిని కూడా ప్రపంచ పటంలో పెడతానని గొప్పలు చెప్పిన బాబుగారు, ఏదో ఒక సంవత్సరం కొండవీటి వాగు ఉదృతంగా ప్రవహిస్తే ప్రపంచపటంలో నుంచి అమరావతి అనే గొప్ప రాజధాని తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది. మొన్న కేరళలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకూడదంటే సరైన ప్రదేశంలో రాజధానిని నిర్మించి భావితరాలకు భరోసా ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది.