మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నిన్న ఇచ్చిన సర్వే పై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. లగడపాటి సర్వే సైతం మహాకూటమి విజయం తథ్యమని చూపిందని.. ఇక తెరాస పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. రెండున్నర నెలల క్రితం లగడపాటి రాజగోపాల్‌ చేసిన సర్వే ప్రకారం తెరాసకు 90 సీట్లు వస్తాయంటే ఆనందపడిన కేసీఆర్‌.. ఇప్పుడు తెరాస ఓడిపోతుందని చెబితే ఆయనపై విమర్శలకు దిగడం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఎన్నికలలో తెరాస ని చిత్తు చేసి మహాకూటమిని అధికారంలోకి తీసుకురావాలన్నారు చంద్రబాబు.