అనంతపురం జిల్లా పర్యటనలో చంద్రబాబు నాయుడు ధర్మవరం నియోజవర్గం నేతలో భేటీ అయ్యారు. ఈ భేటీలో పరిటాల కుటుంబానికి ధర్మవరం బాధ్యతలు అప్పగించాలని నిర్ణయానికి వచ్చారు. ఇక ధర్మవరం ఇంఛార్జిగా ఉన్న వరదాపురం సూరి టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లడంతో చంద్రబాబు మాట్లాడుతూ 2009 ఎన్నికలలో ఒకాయనను ఇంఛార్జిగా చేసి 2014 ఎన్నికలలో మీరు అతనిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇప్పుడు నాకే నీతులు చెబుతాడా… మిమల్ని నటెట్టా ముంచి వెళ్లిపోయాడని వరదాపురం సూరి పేరెత్తకుండా బాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. 

ధర్మవరం నియోజకవర్గంలో కార్యకర్తల నాడి తెలుసుకుందామని మీటింగ్ పెడితే… ఏకంగా దానిని బహిరంగ సభగా మార్చాల్సి వచ్చిందని, ఇంత రాత్రి పూట కూడా వేలాదిగా వచ్చి తనకు మద్దతు తెలపడం మర్చిపోలేనని, ఎవరు పార్టీలో నుంచి వెళ్లినా ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ శాశ్వతమని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు.   

మరోవైపు బాబు మాట్లాడుతూ ఏపీని సీఎం జగన్ తిరోగమనంలో నడిపిస్తున్నారని, టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నిటిని నిలిపివేశారని, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమపై ఎంత బురద చల్లినా టీడీపీ ప్రవేశ పెట్టిన పధకాలు ప్రజాప్రయోజనాల కోసం కొనసాగించారని సీఎం జగన్ మాత్రం అవగాహన రాహిత్యంతో వాటన్నిటిని తొలగిస్తూ వ్యవస్థలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

 
  •  
  •  
  •  
  •  
  •  
  •