తెలంగాణాలో ఎన్నికల ప్రచారం హరాహోరీగా సాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్టీల వారు భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారానికి ఇంకా 5 రోజులో మిగిలివుండటంతో ప్రచారాన్ని వేగవంతం చేశారు. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నేడు, రేపు తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం అమరావతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.

తెలంగాణలో రెండో విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న బాబు.. ఈరోజు రాజేంద్రనగర్‌, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గణేషగుప్తా, సుహాసినిలకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే రేపు మలక్‌పేట, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం చేసే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్, మక్తల్‌లో చంద్రబాబు ప్రచార సభలు ఉంటాయని పార్టీ శ్రేణులు అంటున్నాయి. చంద్రబాబుతోపాటు హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ప్రచారం చేయనున్నారు. సనత్ నగర్, ముషీరాబాద్ నియోజకవర్గంలో ఈ రోజు బాలకృష్ణ రోడ్ షో నిర్వహించనున్నారు.
  •  
  •  
  •  
  •  
  •  
  •