ఉండవల్లి కరకట్ట మీద చంద్రబాబు నాయుడు ఇంటి పరిస్థితి ఎలా ఉందో తెలుసుగా… ఇప్పుడు వరద నీరు వెల్లువలా రావడంతో ఆ ఇల్లు ప్రమాదంలో పడింది. ఇప్పటికే ఇంటి లోపలకు నీరు రావడంతో, కింద ఉన్న సామానంతా పైకి చేరవడంతో పాటు… చంద్రబాబు నాయుడు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కానీ తెలుగుదేశం నేతలు మాత్రం బుకాయిస్తూ అసలు చంద్రబాబు ఇంటికి ఎలాంటి ప్రమాదం లేదని, కావాలనే వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అంటున్నారు. సరే నిజంగానే చంద్రబాబు ఇంటికి వరద ముప్పు లేకపోతే… హడావిడిగా మొన్న ఉదయం హైదరాబాద్ వెళ్ళవలసిన పనేమిటి. చంద్రబాబు కుటుంబం అంతా ఎప్పుడైతే వరద వస్తుందని తెలిసిందో ఆ క్షణమే ఇల్లు ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇక చంద్రబాబు కాన్వాయ్ కూడా హ్యాపీ రిసార్ట్ కు తరలించారు. తన ఇంటికి వరద ముప్పు లేదు అంతా సక్రమంగానే నిర్మాణం జరిగిందని బాబు భావిస్తే ఎందుకు ఇల్లు ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్లిపోయాడో?

ఇక ఇంత జరిగాకా ఇప్పుడు చంద్రబాబు ఇంటిని వరద నీరు చుట్టూ ముట్టడంతో మరొక రకంగా బుకాయించే పని చేస్తున్నారు. పైనుంచి నీరు వస్తున్నా జగన్ కావాలనే ప్రకాశం బ్యారేజి కిందకు నీరు వదలకుండా చంద్రబాబు ఇంటిని ముంచివేయాలని ప్రయత్నాలు చేశాడని వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ముందుగా చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నిర్మాణం గురించి ఆలోచిస్తే ఆ ప్రాంతంలో నీటి గరిష్ట లెవెల్ 22.6 మీటర్లు… కానీ లింగమనేని గెస్ట్ హౌస్ కట్టింది మాత్రం 19 మీటర్ల లెవెల్ లో… అంటే లింగమనేని రమేష్ తన ఇంటిని అక్రమ నిర్మాణం చేస్తూ కూడా కక్కుర్తి పడ్డాడన్న మాట. అలాంటి కక్కుర్తి పడి కట్టిన ఇంటిలో చంద్రబాబు నాయుడు ఉంటూ ఈరోజు సీఎం జగన్… చంద్రబాబు ఇంటిని ముంచేస్తున్నాడని మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

ఇక అంత తక్కువ లెవెల్ లో కడితే నీరు రాకుండా ఎలా ఉంటాయి… అంటే చంద్రబాబు ఇల్లు మునగకుండా తాను కట్టుకున్న 19 మీటర్ల లెవల్ మాత్రమే మైంటైన్ చేస్తూ నీటిని ప్రకాశం బ్యారేజి నుంచి కిందకు వదలాలి అని టీడీపీ నాయకులు చెప్పదలచుకున్నారా? ఒకవేళ ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉంటే… అదే పరిస్థితి కనుక కల్పించి నీటిని గరిష్ట స్థాయి 19 మీటర్ల కన్నా తక్కువగానే కిందకు వదిలితే లంక గ్రామాలు కొట్టుకు పోయి దిబ్బలుగా మారతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు చంద్రబాబు నాయుడు ఆ ఇంటిని ఖాళీ చేసినప్పుడే ఆ ఇల్లు ఒక ఒక అక్రమ కట్టడం అని నిర్ధారకు ప్రజలు వచ్చారు. ఇంకా ఎంత కల్లబొల్లి మాటలతో బొంకుదామని చూసినా నమ్మడానికి ప్రజలైతే సిద్ధంగా లేరు.

  •  
  •  
  •  
  •  
  •  
  •