టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అధికార గృహానికి వరద ముప్పు ఉందా? అంటే అవుననే అంటున్నారు. ఆయన గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలో కృష్ణానది కరకట్ట పక్కన లింగమనేని అతిధి గృహంలో ఉంటున్నసంగతి తెలిసిందే. కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టులు కూడా ఎత్తివేసిన నేపథ్యంలో వరద నీరు పోటెత్తి దిగువకు ప్రవహిస్తుంది.

మొదట శ్రీశైలం, ఇప్పడు నాగార్జున సాగర్ గేట్లు అలాగే పులిచింతల గేట్లు కూడా ఎత్తి వేశారు. ఈ వరద నీరంతా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కి చేరుకుంటుంది. వరద ప్రవాహం మరింత పెరిగితే చంద్రబాబు నివాసానికి ముప్పు తప్పదని అంటున్నారు. ప్రకాశం బ్యారేజ్ బ్యాక్ వాటర్ ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఆ భవనానికి ప్రమాదం సంభవించవచ్చు అంటున్నారు. కాగా 2009 తర్వాత ఏనాడు ఇంత వరద కృష్ణానదికి సంభవించలేదు. మళ్ళీ పది సంవత్సరాల తర్వాత భారీ వరదలుతో కృష్ణమ్మ జల కల సంతరించుకుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •