సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన స్పీడ్ ను పెంచారు. తాజాగా గుంటూరులో పర్యటించిన ఆయన సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు కి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.

గత కొన్ని రోజులుగా జనసేన నేతల ఫై , కార్య కర్తలపై , అలాగే పార్టీ ఆఫీస్ లపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవల కొంతమంది అల్లరిమూకలు కార్యకర్తల ఫై రాళ్ల దాడి చేయగా ఈ దాడి లో ఆడవారికి సైతం గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, వైసీపీ అధినేతలను హెచ్చరించారు.

తాను 2014 లో టీడీపీ కి సపోర్ట్ చేయటంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అలాంటి జనసైనికులపై దాడి చేస్తారా? అంటూ టీడీపీ వారిని హెచ్చరించారు. అలాగే చంద్రబాబు లాగా, జగన్ లాగా తనకు ఆస్తులు లేవని తాను ఓ సాధారణ కానిస్టేబుల్ కొడుకునని చెప్పారు పవన్ కళ్యాణ్.