కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన ప్రజలు దారుణమైన ఓటమిని అందించారు. కానీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు… పసుపు కుంకుమ పేరుతో పాటు, తెలుగు దేశం పార్టీ సానుభూతిపరులకు ఇష్టమొచ్చినట్లు నిధులు మంజూరు చేసి ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసారు.

చంద్రబాబు నాయుడు కావాలనే ఖజానాను ఖాళీ చేసి రాబోయే ప్రభుత్వానికి చేటు చేయాలని చూసారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకు రాబోయే ప్రభుత్వం చంద్రబాబుదే అవ్వవచ్చు కదా… అనే ప్రశ్న తలెత్త వచ్చు. కానీ చంద్రబాబు నాయుడుకి తన ఓటమిపై గత జనవరిలోనే క్లారిటీ వచ్చిందట. వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో మనం గెలవలేమని తెలిసే ఎడాపెడా ఇష్టమొచ్చిన రీతిలో వేల కోట్ల రూపాయలను తెలుగు తమ్ముళ్లకు అప్పనంగా దోచిపెట్టి జగన్ ప్రభుత్వాన్ని మొదట్లోనే ఇరుకున పెట్టాలని భావించారట. 

చంద్రబాబు నాయుడు చేసిన పని వలన జగన్ ప్రభుత్వం సరిగ్గా ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉంది. బాబు కనుక కావాలనే ఇలా చేస్తే అది క్షమించరాని నేరం. రాజకీయాలలో ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ రేపు ఉండదు. కానీ ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి ప్రయత్నించాలి తప్పా… ఇలా ప్రజలను బాధ పెట్టేలా తన వారికి దోచిపెట్టుకొని.. తన మీడియాను అడ్డుపెట్టుకొని జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలని అనుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు.

 
  •  
  •  
  •  
  •  
  •  
  •