టీఆర్ఎస్ మరోసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకున్న సందర్భంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తనకు గిఫ్ట్ ఇచాడని, తాను కూడా చంద్రబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్నారు. దీనిపై విలేకరులు రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంటుందని అడగగా, త్వరలోనే తాను విజయవాడ వెళ్లి ప్రెస్ మీట్ పెడతానని, ముందు ముందు మీకే తెలుస్తుంది కదా అయినట్లు మాట్లాడారు.

కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడకి వెళ్లైనా ప్రచారం చేసుకోవచ్చని, తెలంగాణాలో తాను ప్రచారం చేయడానికి వెళ్లానని, తెలుగువారు ఎక్కడ ఉన్న వారి కోసం తాను వెళ్తానని, ఆనాడు ఎన్టీఆర్ తెలుగుజాతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారని కొందరు అటు ఇటు లాలూచి పడవచ్చేమో గాని తాము మాత్రం ఎప్పుడు తెలుగు జాతి కోసమే కృషి చేశామని అన్నారు. కేసీఆర్ తనకు ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ ఏమిటో చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేసీఆర్ మాత్రం కచ్చితంగా చంద్రబాబు నాయుడుని దెబ్బ తీయడానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న పదం వాడాడని తెలుగుదేశం శ్రేణులు మాట్లాడుకుంటున్నారు.
  •  
  •  
  •  
  •  
  •  
  •