చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే వరద వస్తుందని తెలుసుకున్నారో ఇక అప్పటికే తట్టా బుట్ట సర్ధేసుకొని హైదరాబాద్ చెక్కేశారు. ఇక హైదరాబాద్ వెళ్ళాక తన పచ్చ మీడియాతో సరికొత్త రాజకీయం షురూ చేసారు. కరకట్ట ప్రాంతంలో వరద తాకిడిని తెలుసుకోవడానికి ఏపీ ప్రభుత్వం డ్రోన్ల సహాయంతో పర్యవేక్షిస్తుంది.

జెడ్ ప్లస్ కేటగిరి ఉన్న చంద్రబాబు ఇంటితో పాటు… చుట్టు పక్కల ఉన్న అక్రమ నిర్మాణాల దగ్గర కూడా వరద ఉదృతి తెలుసుకొనే ప్రయత్నం చేసారు. కానీ దీనిపైనే అసలు రాజకీయం బాబు హైదరాబాద్ వేదికగా మొదలు పెట్టారు. తన ఇంటిపై డ్రోన్ లను తిప్పుతూ జెడ్ ప్లస్ కేటగిరి ఉన్న నన్ను ఏమి చేయాలనుకుంటున్నారని లేనిపోని కథనాలు వండి వార్చారు.

సరే చంద్రబాబు ఇంటిపైన డ్రోన్లు తిప్పడం తప్పే అనుకుందాం… అసలు జెడ్ ప్లస్ కేటగిరి ఉన్న చంద్రబాబు నాయుడు వరద ముంపు ఉన్న ఇంట్లో ఉండవచ్చా? అంత జెడ్ ప్లస్ కేటగిరి ఉందని బాధపడే నేత అక్రమ నిర్మాణంలో ఉంటూ…సీఎం జగన్ తన ఇంటిని ఏదో చేస్తున్నాడనే బదులు 14 ఏళ్ళ పాటు సీఎంగా ఉన్న వ్యక్తికి ఎలాంటి నిబంధనలు పాటించాలో తెలియదా?

వరద ముప్పుతో జెడ్ ప్లస్ కేటగిరి నేత ఉంటున్న ఇంటికు భద్రతాధికారులు ఎలా అనుమతి ఇచ్చారు. డ్రోన్లు ఎలా అనుమతించారన్న చంద్రబాబు అండ్ కో బ్యాచ్ మరి అంతకంటే ఎక్కువ డేంజర్ జోన్ ఉన్న ఇంటిలో ఉండటానికి అనుమతి ఎలా ఇస్తారని ఏపీ ప్రభుత్వం మీద మరింత విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అండ్ కో కు అర్జెంటుగా కావాల్సింది బురద రాజకీయం.

ఒకవైపున ప్రాజెక్ట్స్ అన్ని నిండుతూ మరోవైపున లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తన ఇంటి మీద డ్రోన్లు అంటూ కొత్త రాజకీయానికి తెరతీయడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది అది అక్రమమని చెబుతున్నా అక్కడే ఉంటూ మరోసారి లొల్లి చేయడానికి చూస్తున్నారంటే తెలుగుదేశం నాయకులు రాజకీయాలను కొత్త ట్రెండ్ లో తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారు.

సొంత ఇల్లు కాని అక్రమ నిర్మాణం కోసం… చంద్రబాబు నాయుడుతో పాటు… తనయుడు లోకేష్ బాబు అంతలా తాపత్రయ పడుతున్నారంటే మొత్తానికి ఆ ఇంటిలో ఏమైనా నేలమానిగాలు ఉన్నాయా అన్న అనుమానం వస్తుంది.

ఇక మరోవైపు లోకేష్ బాబు ట్విట్టర్ సాక్షిగా సీఎం జగన్ తమ ఇంటిని ముంచడానికి గేట్లకు పడవలను అడ్డుగా వేస్తున్నాడని చేస్తున్న కామెడీకి నెటిజన్లంతా పడి పడి నవ్వుతున్నారు. అసలు లోకేష్ బాబే ఇవన్ని పెడతాడా లేక ఎవరైనా లోకేష్ బాబు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేశారా అని ఒకోసారి అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

  •  
  •  
  •  
  •  
  •  
  •