వైసీపీ ఎంపీ సాయిరెడ్డి మాట్లాడిన మాటలను చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ గ్రామా వాలంటీర్లతో పాటు, ప్రభుత్వ ఉద్యోగాలను కూడా మనవాళ్లకు ఇచ్చుకున్నామని అన్నట్లు చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. సాయిరెడ్డి మాట్లాడిన దానితో పాటు చంద్రబాబు నాయుడు షేర్ చేసిన వీడియోలో స్పష్టంగా ఉంది. గ్రామా సచివాలయం అనేవి ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మనవారికి ఇచ్చుకోలేమని లీగల్ కంపల్షన్ వలన ఎవరైతే అర్హత కలిగి ఉంటారో.. ఎవరికైతే మంచి మార్కులు వచ్చాయో వారిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుందని. వారిలో కూడా మన వైసీపీ కార్యకర్తలు ఉన్నారని సాయిరెడ్డి అన్నారు.

కానీ చంద్రబాబు నాయుడు మాత్రం మరోలా ఆపాదించి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా తమ వారికే వైసీపీ నేతలు ఇచ్చుకున్నారని అన్నట్లు పుకార్లు రేపుతున్నారు. సాయిరెడ్డి గారు చెప్పిన దానిలో స్పష్టంగా ఉంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులలో మన వాళ్ళు కూడా ఉంటారని, వైసీపీ పార్టీకి పనిచేసిన కార్యకర్తలు కూడా మంచి మార్కులు సాధించి ఉండవచ్చని దానికి అర్ధం. కానీ బాబు గారి ప్రచారం మాత్రం మరోలా… గ్లోబల్స్ ప్రచారం చేస్తుంటే… ఇంత దారుణంగా ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు ప్రచారం చేస్తున్నాడో.. అప్పట్లో ఎన్టీఆర్ మీద కూడా ఇలాంటి నిందలు వేసి అతడిని సీఎం కుర్చీ నుంచి దించేశాడా అనిపిస్తుంది. బాబు చేసే గ్లోబల్స్ ప్రచారంతో… గ్లోబల్స్ సృష్టికర్తకే సిగ్గేసేలా ఉంది.