చంద్రబాబు నాయుడు సమీక్షల పేరుతో చేసిన హడావిడి మూన్నాళ్ళ ముచ్చటగానే ముగించి హడావిడిగా హైదరాబాద్… జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఎన్నికల ఫలితాలపై ఎన్ని సమీక్షలు చేసినా ఇప్పుడు మార్చేది ఏమి ఉండదని, ఇప్పటికే ఈవీఎంలలో ప్రజల ఓటు నిక్షిప్తమై ఉండటంతో పాటు, అన్ని సర్వేలు వైసీపీ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడం గ్యారెంటీ అని చెప్పడంతో, ఎన్నికల ఫలితాల తరువాత ఎలాంటి ప్రణాళిక రచించాలని రామోజీరావుతో చంద్రబాబు రామోజీ ఫిలిం సిటీలో అత్యవసర భేటీ అవుతున్నారు.

ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికలలో మరోసారి బీజేపీ ప్రభుత్వం మిత్రపక్షాలను కలుపుకొని మరోసారి అధికారం కైవసం చేసుకుంటుందని, కాంగ్రెస్ పార్టీకి చెందిన మిత్ర పక్షాలను కలుపుకొని ముందుకు వెళ్లినా, చాల దూరంలో ఆగిపోవడంతో చంద్రబాబు నాయుడుకి కొంచెం భయం పట్టుకున్నట్లు కనపడుతుంది. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో గెలిచి మోదీ అధికారంలోకి వచ్చినా ఇబ్బందే అని, ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోయి మోదీ అధికారంలోకి వస్తే మరింత ఇబ్బంది అని చంద్రబాబు నాయుడు లెక్కలు వేసుకొని బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారు. ఇప్పటికే బీజేపీలోని కొంత మంది పెద్దలతో టచ్ లో ఉన్నాడని, రామోజీరావుతో కూడా ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడి ఎన్నికల తరువాత ఎలా వ్యవహరించాలి అనే దాని మీద దృష్టి పెట్టినట్లు కనపడుతుంది.

మరోవైపున కాంగ్రెస్ పార్టీతో కలసి వచ్చే మిత్రపక్షాలతో కేసీఆర్ భేటీ అవ్వడం కూడా చంద్రబాబు నాయుడుకి మరింత టెన్షన్ పెడుతుంది. కేసీఆర్ రెండు రోజుల క్రితం డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీలో కూడా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సీపీ అధికారాన్ని కైవసం చేసుకోనుందని, దాదాపుగా 18 నుంచి 21 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని సర్వేలతో సహా వివరించడంతో స్టాలిన్ కూడా కొంత ఆంధ్ర రాజకీయాల పట్ల కొంత ఆసక్తి చూపించి తన అనునాయుల చేత ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను పూర్తిగా తెలుసుకొని వైఎస్ జగన్, కేసీఆర్ లతో కలసి ముందుకు వెళ్లాలన్న రీతిలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

ఒకవేళ ఇదే కనుక జరిగితే చంద్రబాబు నాయుడుకి మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినట్లే. వీటన్నిటికీ తక్షణ పరిష్కారం బీజేపీతో అర్జెంట్ గా సఖ్యత ఏర్పరుచుకొని కేసుల నుంచి కొంత మేర విముక్తి పొందాలన్న ఉద్దేశం సుస్పష్టంగా కనపడుతుంది. రామోజీరావుకు కూడా బీజేపీ పార్టీతో మంచి సంబంధాలు ఉండటంతో చంద్రబాబు నాయుడుకి అర్జెంటు గా రామోజీరావు గుర్తుకు వచ్చాడని, రామోజీరావు ను ట్రబుల్ షూటర్ గా రంగంలోకి దిగి తాను అనుకున్నది నెరవేర్చుకోవాలని బాబు ఆలోచన. కానీ మోదీ మరోసారి చంద్రబాబు నాయుడుని దగ్గరకు తీసే పరిస్థితులు కనపడటం లేదు. ఏమో రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు.