ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండగను జరుపుకోవడానికి తన సొంత గ్రామమైన నారావారి పల్లెకు కుటుంబ సమేతంగా వెళ్లారు. చంద్రబాబు నాయుడు స్థాపించిన హెరిటేజ్ సంస్థ దినదిన అభివృద్ధి చెందుతూ ప్రముఖ సంస్థగా మంచి ప్రాముఖ్యత సంతరించుకుంది. హెరిటేజ్ సంస్థకు ఎండీగా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు తన భార్య గురించి చెబుతూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. తన భార్య భువనేశ్వరీ హెరిటేజ్ సంస్థను ప్రతిరోజు కాపలా కాస్తూ వస్తున్నారని, సంస్థను సమర్ధవంతంగా నిర్వహిస్తూ అందరి మన్ననలను పొందారని అన్నారు. 26 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన హెరిటేజ్ సంస్థను నైతికతతో, నిజాయితీగా వ్యాపారం చేస్తూ సమాజానికి ఉపయోగపడేలా తయారైందని బాబు అన్నారు. హెరిటేజ్  సంస్థను భువనేశ్వరీ ప్రతిరోజు స్వయంగా పరిశీలిస్తూ ఉంటారని, తన కోడలు బ్రాహ్మణి కూడా బాగా పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు తన భార్య, కోడలి గురించి చెబుతూ మూసి మూసి నవ్వుకున్నారు.
  •  
  •  
  •  
  •  
  •  
  •