చంద్రబాబు నాయుడు చేసే రాజకీయం తెలియక ఒక్కోసారి అతడితో పాటు అడుగులో అడుగేస్తూ గత నలభయ్యేళ్లుగా అతడి వెంట నడుస్తున్న నాయకులకే చంద్రబాబు నాయుడు రేపు తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందని ఆలోచిస్తుంటారు. ఎందుకు అంటే అతడి మైండ్ లో ఒకటి రన్ అవుతుంటే దానికి అనుగుణంగా ఒక ఆరు నెలలు ముందు నుంచే ప్లాన్ అమలు చేస్తాడు. ఒక్కోసారి అతడు తీసుకునే యు టర్న్ చూసి ఎన్నిసార్లు షాక్ కు గురైనా ఫ్రెష్ గా మరొక షాక్ ఇస్తూ తెలుగుదేశం పార్టీని నిలబెట్టడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు.

అందులో భాగంగానే ఎప్పుడైతే దారుణంగా గత సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయాడో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు వైఖరిలో మార్పుతో పాటు ఏకంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఐదుగురు శాసనసభ్యులు బీజేపీ పంచన చేరినా చూసి చూడనట్లు వ్యవహరిస్తూ తెర వెనుక వారితో మంతనాలు చేస్తూ తన రాజకీయా చాణిక్యతను చూపెడుతుంటారు. రాజ్యసభ సభ్యులు అంటే ప్రజలతో సత్సబంధాలు తక్కువ, వారిదంతా పైసల్ తో కూడుకున్న వ్యవహారం ఒకరకంగా బాబుకి అత్యంత నమ్మకస్తులైన బినామీలు, వందల కోట్ల డబ్బులు తగలేసి రాజ్యసభ సీటు కొనుక్కుని నాయకుడిగా రాత్రికి రాత్రే ఎదగడానికి మంచి హెల్ప్ చేస్తుంది.

కానీ వల్లభనేని వంశీ వ్యవహారం అలా కాదు నేరుగా ప్రజలతో సంబంధాలు తెలుగుదేశం పార్టీ క్యాడర్ తో పాటు సొంతగా అతడికి అనుచరులు ఉండటం ఇలా అనేక రకాలైన వ్యవహారాలు… అలాంటి వాడిని వదులుకుంటే నాలుగు ఓట్లు పోవడమే కాదు, అసెంబ్లీలో తుమ్మితే ఊడిపోయేలా ఉన్న ప్రతిపక్ష హోదా కూడా ఒకొక్కరు చేజారితే ఎగిరిపోవడమే కాకా అత్యంతం దారుణమైన అవమానాన్ని నలభయ్యేళ్ళ రాజకీయ జీవితంలో ఎదుర్కోవలసిన పరిస్థితి ,

అందుకే వంశీ తాను రాజీనామా చేస్తున్నానని లెటర్ రాసిన వెంటనే, తెలుగుదేశం పార్టీ నీకు అండగా ఉంటుందని, కలసి వైసీపీ పార్టీని ఎదుర్కొందామని బాబు రివర్స్ లో లెటర్ రాసి వంశీని బుజ్జగించే పని మొదలు పెట్టి ఇప్పటికే ఫోన్లు గట్రా చేస్తూ వంశీ రాజీనామా చేయవద్దని వత్తిడి చేస్తూ కేశినేని నాని, కొనకళ్ల నారాయణ వంటి వారిని దూతలుగా పంపించడానికి సిద్ధమవుతున్నారు. మరి రాజ్యసభ సభ్యుల విషయంలో మాత్రం దూతలతో పనే ముంది వారిని బీజేపీలోకి పంపి అక్కడ రాజకీయం చేయని, వంశీ లాంటి ఎమ్మెల్యేలను టీడీపీలో పెట్టుకొని వైసీపీపై బురద చల్లిస్తూ, అసెంబ్లీలో అండగా నిలబడాలి.

బాబు రాజకీయం కోసం ఎవరని ఎలా వాడుకోవాలో తెలుసు కాబట్టి అతడికి ఎవరు… ఎప్పుడు చనువుగా ఉన్నట్లు ఏ రాజకీయ నాయకుడు కనపడడు. అవసరం ఉన్న వరకే. వాడకం.. తరువాత కూరలో కరివేపాకు… అవసరం అనుకుంటే పక్క పార్టీలోకి పంపి వ్యూహం అమలు చేసి ప్రత్యర్థులకు దిమ్మ తిరిగే కౌంటర్లు ఇస్తూ రాజకీయ చాణక్యత చూపెడుతుంటాడు. ఇది అన్ని సార్లు పని చేయదు. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు… అన్ని మన రోజులనుకుంటే పప్పులో కాలేసినట్లే.