చంద్రబాబు వ్యవహారం బలే ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి ఎత్తు వేయాలో… ప్రజలను ఎలా బుట్టలో వేసుకోవాలో… ప్రజా వ్యతిరేక ఉద్యమాలను ఎలా రగల్చాలో గ్లోబల్స్ ప్రచారం చేయడంలో దేశం మొత్తంలో చంద్రబాబు తరువాతే ఎవరైనా అన్నది బల్ల గుద్ది చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు చెబుతూ గత రెండు నెలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాదాపుగా 469 మంది మీద దాడులు చేసారని, ప్రజలు ఒక్కసారిగా తిరగబడితే వైసీపీ నిలబడలేదని ఎనెన్నో కల్లబొల్లి కథలు చెబుతున్నారు.

ఇక చంద్రబాబు మాటలకు ఒకటి రెండు రోజుల ముందే తెలుగుదేశం నేతలు వారికి నచ్చిన అంకెలు చెబుతూ ఒకరేమో తెలుగుదేశం కార్యకర్తలపై ఇప్పటి వరకు 70 మందిపై దాడులు చేసారంటే మరొకరేమో కాదు కాదు 170 మందిపై దాడులు చేసారని అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఈ లెక్క కంటికి వింపుగా ఉండటం లేదని అనుకున్నారేమో… ఏకంగా 469 మందిపై దాడులు జరిగాయని చెబుతున్నారు.

2009లో రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సమయంలో కూడా పార్టీ సమావేశంలో జగన్ చేసిన అవినీతిపై ప్రచారం చేద్దామని జగన్ దాదాపుగా 1000 కోట్ల రూపాయల వరకు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా లబ్ది పొందాడని అంటే, మరొక నేత కాదు దానిని మనం 10 వేల కోట్లని చేద్దాం అన్నాడట. కానీ బిగ్ బాస్ మాత్రం ఇంకా వేల కోట్లు జనానికి అనడం లేదని… ఏకంగా లక్ష కోట్లు అవినీతి చేసాడని పుట్టించాలని ఆదేశాలు జారీ చేయడంతో యెల్లో మీడియాతో పాటు, పార్టీకి అనుబంధంగా పనిచేసే మొత్తం సభ్యులు జగన్ నిజంగానే లక్ష కోట్ల రూపాయల అవినీతి చేశాడా అని ప్రజలను నమ్మించే పని చేసారు. కానీ చివరకు అదంతా అబద్ధమని 700 కోట్ల రూపాయలపై ఇన్వెస్టిగేషన్ నడుస్తుందని వార్తలు వచ్చాయి. ఇక 700 కోట్లు ఇంకా బక్క చిక్కి ఎంతకు వస్తాయో తెలియదు… అసలు జగన్ తాను ఏ తప్పు చేయకపోవడం వలనే అంత ధీమాగా ఉన్నాడు.

అప్పట్లో జగన్ మీద చేసిన గ్లోబల్ ప్రచారం వలే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరో ప్రచారాన్ని నెత్తికి ఎత్తుకొని జగన్ ఏదో చేసేస్తున్నాడని… రాష్ట్రాన్ని రాయలసీమ రౌడీలతో నింపేస్తున్నాడని ఎన్ని కథలు చెబుదాం అనుకున్నా.. సోషల్ మీడియా సాక్షిగా అన్ని నిజాలు నిర్భయంగా బయట పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని వైసీపీ సోషల్ మీడియా సభ్యులు వాపోతున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పే గ్లోబల్స్ ప్రచారం మాత్రం నమ్మే పరిస్థితులలో అయితే ప్రజలు లేరన్న విషయం అయితే గుర్తుంచుకోవాలి.

  •  
  •  
  •  
  •  
  •  
  •