ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఈ నెల 25న విశాఖకు వెళ్ళబోతున్నారని తెలుస్తుంది. ఎల్జి పాలిమర్స్ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించనున్నారు. అయితే ఏపీకి వెళ్ళడానికి ఆయన తెలంగాణ, ఏపీల డిజిపిలకు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే తెలంగాణ నుండి గ్రీన్ సిగ్నల్ రాగా, ఏపీ నుండి అనుమతి పెండింగ్ లో ఉంది. కావున ఏపీ ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక ఏపీ నుండి అనుమతి వస్తే చంద్రబాబు ఈ నెల 25న విశాఖ వెళ్లనున్నారు. ఇక విశాఖ పర్యటన అనంతరం చంద్రబాబు అమరావతి వస్తారని తెలుస్తుంది. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 20 నుండి చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ యువ నటుడు మృతి..!

తెలంగాణలో 1800 దాటిన కరోనా పాజిటివ్ కేసులు.. 49 మృతులు..!