హీరోయిన్ ఛార్మి దర్శకుడు పూరిజగన్నాథ్ తో కలసి వరుసగా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తరువాత ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బంపర్ హిట్ కొట్టిన పూరి.. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ సినిమా తీసుతున్నాడు. ఈ సినిమాకు ఛార్మి కూడా నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సినిమా షూటింగ్ జనవరిలో ముంబైలో మొదలైంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

ఇక ఛార్మి ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండ పై ప్రశంసలు కురిపించింది. విజయ్ సెట్లో ఉంటె ఎలాంటి టెన్షన్, కంప్లైంట్స్ ఉండవని.. అతడు ఉన్నంత సేపు చక్కగా సరదాగా ఉంటుందని చెప్పింది. ఇక ఫ్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

కరెన్సీ నోట్ల మీద పవన్ కళ్యాణ్ ఫోటో వేయాలంటాడేమో

ఏపీ సీఎం జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బుల్లితెర యాంకర్..!