విశాఖలో ఎల్జి పాలిమర్స్ లో గురువారం తెల్లవారుజామున గ్యాస్ లీకేజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని మరువక ముందే మరో గ్యాస్ లీకేజ్ కలకలం సృష్టిస్తుంది. ఛతీస్‌గఢ్‌లో రాయ్‌గఢ్‌లోని పేపర్ మిల్లులో గ్యాస్ లీకవడంతో ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఇక వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇక వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

లాక్ డౌన్ కారణంగా ఛతీస్‌గఢ్‌లో రాయ్‌గఢ్‌లోని పేపర్ మిల్లు దాదాపు 45 రోజుల నుండి మూసి ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా పేపర్ మిల్లును ప్రారంభించారు. ఇక గురువారం మధ్యాహ్నం మిల్లులో ట్యాంకును 7 గురు కార్మికులు శుభ్రం చేస్తుండగా ప్రమాదపుశాత్తు అందులోని గ్యాస్ లీకవడంతో కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితులను ఆస్పత్రికి తరలించారు.

chhattisgarh gas leakage

గ్యాస్ లీకేజ్ మృతులకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన సీఎం వైఎస్ జగన్..!

అమెరికాలో దారుణ హత్యకు గురైన చైనా శాస్త్రవేత్త..!