రవితేజ హీరోగా డిస్కో రాజా సినిమా ఫస్ట్ లుక్ వినాయక చవితి రోజు విడుదల చేసి చిత్ర యూనిట్ మంచి జోష్ లో ఉంటే, ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి మాత్రం ‘చీప్ స్టార్’ అంటూ సంబోధించడంతో… ఆ చీప్ స్టార్ ఎవరా అని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. చివరకు ఫైనల్ గా అజయ్ భూపతి కామెంట్ చేసింది రవితేజపైనే అని తేల్చివేస్తున్నారు.

అజయ్ భూపతి దర్శకత్వంలో రవితేజ ‘మహాసముద్రం’ అనే సినిమాలో నటించవలసి ఉంది. ఈ సినిమా కోసం రవితేజతో దర్శకుడు చాల రోజులుగా ట్రావెల్ చేస్తున్నాడు. ఇక సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళుతుంది అనుకున్న సమయంలో రవితేజ హ్యాండ్ ఇవ్వడంతో అజయ్ భూపతికి ఒళ్ళు మండి ‘చీప్ స్టార్’ అని కామెంట్స్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రవితేజతో పాటు, సిద్ధార్ధ, అదితి రావుకు కూడా అడ్వాన్స్ ఇచ్చేశారట. 

కానీ తీరా సినిమాను తప్పించుకునేలా రవితేజ ప్రవర్తన తేడాగా ఉండటంతో నిర్మాత కిరణ్ కు ఇలాంటి చీప్ స్టార్ లతో చేయవలసిన పనిలేదని అజయ్ భూపతి గట్టిగానే చెప్పాడట. రవితేజకు తమిళ సినిమా ‘విక్రమ్ వేద’ తలుపు తట్టిందని, అందుకే ‘మహాసముద్రం’ సినిమాను పక్కన పెట్టేసాడన్న వార్తలు గుప్పుమంటున్నాయి. గతంలో కూడా దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా సెట్స్ మీదహ్కు వెళ్లిన తరువాత క్యాన్సిల్ అవ్వడం జరిగింది. 

రెమ్యూనరేషన్ దగ్గర రవితేజ బెట్టు తగ్గకపోవడంతోనే అలాంటి పరిస్థితి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక అజయ్ భూపతి ‘మహాసముద్రం’ సినిమాకు సంబంధించి స్టోరీ లైన్ ఇప్పటికే నాగచైతనయతో చేయాలని అనుకుతున్నాడట. ఈ స్టోరీ లైన్ సమంతకు వినిపించగా స్టోరీ లైన్ నచ్చడంతో సినిమాను నాగ చైతన్యతో చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 

కానీ అజయ్ భూపతి చేసిన ‘చీప్ స్టార్’ కామెంట్ తో రవితేజ గతంలో ఎవరెవరితో సినిమాలు చేస్తానని చివరకు మోసం చేశాడో ఆ లిస్ట్ అంతా బయట పెడుతూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అసలు ఇంతకు అజయ్ భూపతి చెప్పిన ‘చీప్ స్టార్’ రవితేజానా లేక మరెవరైనా అనేది అజయ్ భూపతి చెబితే తెలుస్తుంది. అప్పటి వరకు రవితేజను ఊహించుకుంటూ నెటిజన్లు ట్రోలింగ్ కు పని చెప్పారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •