ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టులో ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(33), సౌరభ్‌ తివారీ(42) రాణించడంతో ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

ఇక ఆ తరువాత లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన చెన్నై జట్టు.. ఆరు పరుగులకే ఓపెనర్లు మురళి విజయ్(1), షేన్ వాట్సన్(4) వికెట్లను ఆదిలోనే కోల్పోయినప్పటికీ రాయుడు మాత్రం చక్కని షాట్లతో 48 బంతుల్లో 71 పరుగులు చేయగా, డూప్లెసిస్ 44 బంతుల్లో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి చెన్నై విజయకేతనం ఎగరవేసింది.