ఐపీఎల్ టోర్నీలో మొదట మ్యాచ్లో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆ తరువాత వరుసగా మూడు మ్యాచ్ లలోను ఓటమి చెంది డీలా పడిపోయింది. ఇక తాజాగా ఆదివారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా సూపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. మొదటగా బ్యాటింగ్ కు దిగిన చెన్నై.. నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రాహుల్ 63 పరుగులు, మయాంక్ 26 , పూరన్ 33, మ్యాక్స్‌వెల్ 11 పరుగులు చేశారు.

ఇక ఆ తరువాత 179 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టు.. ఒక్క వికెట్ నష్టపోకుండా 17.4 ఓవర్లలో లక్యాన్ని ఛేదించింది. వాట్సన్ 83 నాటౌట్, డుప్లెసిస్ 87 నాటౌట్ గా నిలిచిచారు. దీంతో చెన్నై జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.