తెలుగు దేశం అధికారంలో ఉన్న సమయంలో అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వెటకారాలు ఎవరు మర్చిపోయే పరిస్థితి లేదు. ప్రస్తుత సీఎం జగన్ ను నేరుగా తన కుటుంబ సబ్యులను దూషించేలా అతడి తమ్ముడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తిట్టిన తిట్లు అత్యంత జుగుత్సాకరం. జేసీ దివాకర్ రెడ్డి కూడా ఎప్పుడు మా వాడే మా వాడే అంటూ జగన్ పై వ్యంగ్యంగా మాట్లాడుతూ వైసీపీ అభిమానుల ఆగ్రహానికి గురవుతుండేవాడు. జగన్ కు అంత సీన్ లేదని ఇలా పలువిధాలుగా జగన్ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసేలా మాట్లాడటంతో ఇప్పుడు జగన్ సీఎం కావడంతో జేసీ కుటుంబానికి ఒకదాని వెనుక కష్టాలు వెంటాడుతున్నాయి.

ఈమధ్య అక్రమ బస్సుల నెంబర్ ప్లేట్స్ విషయంలో జైలు ఉచాలు లెక్కబెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అతడి తనయుడు ఈమధ్య జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పుడు అధికారులు జేసీ కుటుంబానికి ఉన్న గనుల పరిశీలనలో మునిగితేలుతున్నారు. దీనితో జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ కుటుంబానికి ఉన్న ఆస్తులు ఆ గనులు మాత్రమే అని తమ నోటికాడి కూడు తీసేస్తారా అని తమకు ఏదో ఒకరోజు ఛాన్స్ వస్తుందని అప్పుడు ఈ అధికారుల సంగతి చెబుతామని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యక్తిగతంగా తన కుటుంబాన్ని జగన్ సర్కార్ టార్గెట్ చేసిందని నా కుటుంబాన్ని అన్ని రకాలుగా బాధిస్తున్నారని, తన తమ్ముడిని లోపలేశారు. ఇప్పుడు తనపై పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పర్మిట్ల కోసం మరొకసారి వస్తానని మైనింగ్ పర్మిట్లు ఇవ్వకుంటే తాను ఇక్కడే నిరాహారదీక్షకు దిగుతానని ఎన్నో సత్కారాలు అనుభవించిన పెద్దవాణ్ణి, నాకు సత్కారం చేసే పెద్దవాళ్లకు సత్కారం చేసి ఏదో ఒకరోజు ఋణం తీర్చుకుంటానని ఆవేశంగా మాట్లాడారు.

గతంలో అధికారంలో ఉన్నాం కదా అని జగన్ కుటుంబంపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి ఈరోజు తమ దాకా వచ్చేసరికి జేసీ దివాకర్ రెడ్డి అల్లాడిపోతున్నారు. సత్కారాలు గట్రా అని మాట్లాడే జేసీకి అప్పట్లో వారు చేసిన సత్కారాలు ఇప్పుడు జగన్ సర్కార్ ఇస్తున్నది ప్రతిసత్కారాలే అన్న విషయం గుర్తించినట్లు లేరు. నువ్వు నన్ను బాధ పెడితే నేను నిన్ను తప్పకుండ బాధ పెట్టి తీరుతానని ధోరణిలో జగన్ సర్కార్ కచ్చితంగా ముందుకు వెళుతుంది. రాజకీయాలంటే అంతే, తాము అధికారంలో ఉన్నాం కదా ఎగిరెగిరి పడితే ప్రతిఒక్కరికి ఛాన్స్ వస్తుంది, వారు చేసిన తప్పులు ఎప్పటికైనా అనుభవించక తప్పదు.