మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఇప్పుడు కావాల్సినంత సమయం దొరికింది. ఎప్పుడు రాజకీయాలతో హడావిడిగా గడిపే చిదంబరం, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులలో ఒకరిగా వెలుగొందుతుంటారు. 73 సంవత్సరాల సమయంలో రాజకీయాలు చేయకుండా శేష జీవితం తీసుకోవలసిన వయస్సులో రాజకీయాలు చేస్తే ఇలానే ఉంటుందేమో. అందుకే శేష జీవితం గడపమని ప్రస్తుతానికి తీహార్ జైలుకు తరలించారు.

తీహార్ జైలు అంటేనే దేశంలోనే కరుడుకట్టిన నేరస్థులు ఉండే జైలు, నిన్న చిదంబరాన్ని తీహార్ జైలుకి కాకుండా మరెక్కడికైనా పంపించమని జడ్జిని అభ్యర్ధించినా తీహార్ జైలుకే పంపించినట్లు తెలుస్తుంది. కనీసం భద్రతనైనా కల్పించమంటే జడ్జి ఆ విషయంపై మారు మాట్లాడకుండా అవసరమైన మందులు వంటివి తీసుకొని వెళ్లవచ్చునని తీర్పు ఇవ్వడంతో చిదంబరం జీవితంలో కొన్ని పేజీలు తీహార్ జైలుకు అంకితమయ్యే అవకాశం లభించింది.

తాను హోంమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షాను ఒక ఫేక్ కేసులో మూడు నెలలు జైలులో పెట్టడానికి ఎంతలా తాపత్రయ పడ్డాడో తెలియనిది కాదు. ఈరోజు అమిత్ షా కూడా లోలోన మూసి మూసి నవ్వులు నవ్వుకొని రాత్రి చిదంబరం జైలు జీవితం ఎలా గడిచి ఉంటుందో అన్న ఒక్క చిన్న సందేహం అయితే అతని మనస్సులో కచ్చితంగా వచ్చే ఉంటుంది.

ఇక అమిత్ షా ఒక్కడినే కాదు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జైలుకి వెళ్లడంలో చిదంబరం పాత్ర కచ్చితంగా ఉంది. అసలు ముందుగా దివంగత రాజశేఖర్ రెడ్డి, చిదంబరం కాంగ్రెస్ పార్టీలో సమకాలీలు. ఇద్దరు రాజకీయాలు వారి వారి రాష్ట్రాలలో చేస్తున్నా… రాజశేఖర్ రెడ్డి ఒంటరిగా బిక్కసచ్చిన కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం కల్పించి రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన ఘనతతో జయహో రాజశేఖరా అంటూ ప్రశంసలు అందుకుంటుంటే చిదంబరం మాత్రం తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని రవ్వంత కూడా మార్చలేక పోయాడు.

ఆ కోపం ఏమైనా చిదంబరానికి… దివంగత వైఎస్ మీద ఉందేమో… తాను మాత్రం నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మార్చలేకుండా ఉంటే… ఈ వైఎస్ ఎవడురా ఇంతలా కాంగ్రెస్ పార్టీని తన కనుసన్నలతో సైగ చేసేలా ఉన్నాడని, వైఎస్ చనిపోయిన తరువాత అతని కుమారుడు జగన్ కాంగ్రెస్ ను వ్యతిరేకించి కొత్త పార్టీ పెట్టుకున్న సమయంలో లేనిపోని కేసులలో ఇరికించి రెండు నెలలో రావలసిన బెయిల్ రాకుండా 16 నెలల పాటు జైలులో ఉంచడంలో సోనియా గాంధీతో పాటు, చిదంబరం కూడా ముఖ్య కారకులు అనడంలో అతిశయోక్తి లేదు.

అలానే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోవడంలో కూడా చిదంబరం ప్రముఖ పాత్ర పోషించాడు. తమిళ ప్రజలు మాత్రం కలసి మెలసి ఉండాలి… మన తెలుగు ప్రజలను మాత్రం వేరు చేయడంలో ఎక్కడలేని ఉత్సాహం చూపించాడు.

ఎప్పుడో చేసిన పాపాలు, మరెప్పుడు పన్నిన కుతంత్రాలు… బ్రతికున్నప్పుడే తిరిగి మనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాయేమో.. అందుకే అన్యాయంగా తాను చేసిన తప్పులు ఒకరకంగా చేస్తే… మరో విధంగా ధన దాహంతో తాను చేసి తప్పులు మెడకు చుట్టుకొని ఈరోజు తీహార్ జైలులో ఊసలు లెక్కబెడుతున్నాడు. తాను ఎవరెవరిని ఎంతలా వేదించి జైలుకి పంపాడో చిదంబరానికి అవన్నీ ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయేమో… ఎంతైనా జైలులో శేష జీవితం గడుపుతున్న ప్రాణం కదా… ఇంకా పనేముంటుంది. ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు వచ్చిన సాదవకాశం అని చెప్పుకోవచ్చు.

అసలు తీహార్ జైలు అంటేనే… ఒక రాజకీయ నాయకుడికి మాయని మచ్చ. తీహార్ లో అడుగుపెట్టడం అంత దారుణం మరొకటి లేదు. కరుడుకట్టిన ఉగ్రవాదులు, దేశానికి ముప్పు తెచ్చేలా వ్యవహరించే రాజకీయ నాయకులు… ప్రజల సొమ్ము అడ్డంగా మింగి తమ జేబులో వేసుకునే నాయకులకు మాత్రమే తీహార్ స్వాగతం చెబుతుంటుంది. న్యాయం అనేది ఎక్కడో ఒక మూలన కూర్చుని చూస్తున్నట్లు ఉంది. అందులో భాగంగానే చిదంబరం చెన్నై టూ తీహార్ వయా సీబీఐ ప్రస్తుత సన్నివేశం.

  •  
  •  
  •  
  •  
  •  
  •