జూలై 27న భారత ప్రభుత్వం 47 చైనా యాప్ లను నిషేధించిన సంగతి తెలిసిందే. టిక్ టాక్ సహా కొన్ని యాప్‌లను ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ప్లే స్టోర్ నుండి తొలగించారు. తాజాగా ఈరోజు మరో రెండు యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ప్లే స్టోర్ తొలగించింది.

ట్విట్టర్, గూగుల్ సెర్చింజన్‌కు‌ ప్రత్యామ్నాయాలుగా పిలువబడే చైనాకు చెందిన యాప్స్‌ వీబో, బైడు సెర్చింజన్‌ను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వీటిని ఈరోజు తాజాగా గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించారు.ఇక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఈ రెండు యాప్‌లను నిషేధించాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటితో పాటు చైనాకు చెందిన మరో 275 యాప్ లను కేంద్రం నిషేధించే ఆలోచనలో ఉంది. కాగా పబ్జీ యాప్‌ను కూడా తొలగించడానికి మోదీ సర్కార్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

‘బొమ్మరిల్లు’ సినిమా ఎన్టీఆర్ చేయలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా..!

సోనూసూద్ మరో గొప్ప సహాయం.. వితంతువుకు ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..!