భారత్-చైనా సరిహద్దులలో నెలకొన్న చర్యలతో ప్రధాని మోదీ కూడా నేరుగా గాల్వాన్ ప్రాంతం వెళ్లి ఆ ప్రాంతాన్ని సందర్శించి అదే ప్రాంతంలో ఆర్మీ జవాన్లతో మీటింగ్ ఏర్పాటు చేయడం, ఇక మోదీ వచ్చి వెళ్లిన తరువాత భారత్ ఆర్మీ జవాన్లు మరింత దూకుడుగా ముందుకెళుతూ చైనాకు ధీటుగా బదులిస్తుండటంతో చైనా ఎట్టకేలకు వెనక్కు తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇరుదేశాల ఒప్పందం మేరకు శాంతి చర్చలలో భాగంగా గాల్వాన్ లోయ నుంచి దాదాపుగా రెండు కిలోమీటర్ల మేర వెనక్కు వెళ్లినట్లు భారత ప్రభుత్వాధికారి ఒకరు తెలియచేసారు. ఘర్షణ జరిగిన ప్రాంతం నుంచి భారత్-చైనా తాత్కాలిక నిర్మాణాలను తొలగించినట్లు చెప్పుకొచ్చారు. దీనితో భారత్ ఇంతా ధీటుగా బదులిస్తుందని ఊహించని చైనా వెనక్కు తగ్గక తప్పలేదు.

ఇప్పటికే చైనాకు సంబంధించిన యాప్స్ తొలగించడంతో పాటు, దేశంలో చైనా ప్రొడక్ట్స్ పూర్తిగా వాడటం మానేయాలని, పిలుపునివ్వడంతో ఆ దేశం ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదముండటంతో ఇప్పుడు ఇలా నిర్ణయం తీసుకున్నట్లు ఉంది. భారత్ కూడా చైనా ఎత్తులను చిత్తు చేస్తూ అన్ని దేశాల ముందు చైనాను ఏకాకిని చేయాలనీ ప్రయత్నించడం కూడా రాబోయే విపత్తును వారు ముందుగానే గ్రహించారని చెప్పుకోవచ్చు.