చైనాలో మొదలైన కరోనా వైరస్ తో ప్రపంచదేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అయితే ఈ కరోనా విషయంలో అమెరికా చైనాపై విమర్శలు సంధిస్తోంది. తాజాగా అమెరికా మరోసారి విమర్శలు చేసింది. చైనా కరోనా వైరస్ ను ప్రపంచానికి తెలియచేయడంతో కావాలనే నిర్లక్ష్యం చేసిందని అమెరికా ఆరోపిస్తుంది. వైరస్ ను ఎదుర్కోవడానికి కావాల్సిన ఔషధాలను నిల్వ చేసుకోవాలనే ఉద్దెశంతో డ్రాగన్ దేశం బయట ప్రపంచంతో దీని తీవ్రతను పంచుకోలేదని తెలియచేసింది. ఓ వైపు తీవ్రతను తక్కువ చేసి చూపుతూనే మరోవైపు చైనా ఎగుమతులను పెంచుకుని, దిగుమతులను తగ్గించిందని అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఓ నివేదికలో పేర్కొంది.

ఇక పైగా చైనా ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలు లేవని చెబుతూ అస్వష్టమైన వాణిజ్య వివరాలతో దాన్ని దాచాలని ప్రయత్నించిందని తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక ప్రపంచదేశాల నుండి ఔషధాలను దిగుమతి చేసుకోవాలన్న ఉద్దెశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థకు సైతం ఇది అంటువ్యాదన్న విషయం చైనా చెప్పలేదంది. ఈ క్రమంలో మాస్కులు, సర్జికల్ గౌన్లను భారీ స్థాయిలో దిగుమతి చేసుకుందని అమెరికా తెలియచేసింది.

మందు బాబుల దెబ్బకు ఏపీ బతుకు చిత్రం మారిపోయేలా ఉంది

బాలుడిని కిడ్నాప్ చేయబోయిన కోతి.. వైరల్ గా మారిన వీడియో..!

కరోనా మరణాలకు అసలు కారణం తెలియచేసిన భారత సంతతికి చెందిన బ్రిటన్ వైద్యుడు ..!

మద్యం కోసం క్యూ కట్టిన అమ్మాయిలు.. సోషల్ మీడియాలో వైరల్..!