చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను తీవ్రంగా వణికిస్తోంది. ఇప్పటికే కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. ఇక చైనాలో కరోనా వైరస్ మొదలైన 70 రోజుల తరువాత దీన్ని నియంత్రించ గలిగారు. ప్రస్తుతం అక్కడ లాక్ డౌన్ ఎత్తివేయడంతో వ్యాపార సంస్థలు, స్కూల్స్, ఫ్యాక్టరీలు యధాతధంగా నడుతున్నాయి. అక్కడ ప్రజల జీవన విధానం కూడా ఎప్పటిలాగానే ఉంది. అయితే తాజాగా చైనాలో పలు పాజిటివ్ కేసులు బయటపడడంతో తీవ్ర కలకలం రేపుతోంది.

తాజాగా చైనాలోని జిలిన్ ప్రావిన్స్ లో 34 కేసులు బయట పడడంతో అక్కడ ప్రభుత్వం అప్రమత్తమైంది. దాదాపు 10.8 కోట్ల మంది జనాభా ఉండే జిలిన్ ప్రావిన్స్ లో ఈరోజు నుండి మళ్ళీ లాక్ డౌన్ నిభందనలు అమలవుతున్నాయి. ఈశాన్య చైనాలో భాగమైన జిలెన్ ప్రాంతంలో బస్సులు, రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలియచేశారు. ఇక పాఠశాలలు, కార్యాలయాలు అన్ని మూతపడ్డాయి. ఇలా ఒక్కసారిగా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్కడ ప్రజలు వణికిపోతున్నారు. కరోనా బాధితులు, అనుమానితులు ఉన్న ప్రదేశాలను పూర్తిగా మూసివేశారు. ఇక నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఒక్కో కుటుంభం నుండి ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుందని.. అక్కడ అధికారులు తెలిపారు. అయితే రష్యాలో ఉండే చైనా పౌరులు తిరిగి రావడం వల్లే కరోనా వ్యాపించి ఉంటుందని కొందరు భావిస్తున్నారు.

ఇక రెండవసారి వుహాన్ లో కరోనా మళ్ళీ తిరగబెడుతుందన్న అంచనాలతో అక్కడ చాలా మందికి కరోనా టెస్టులు చేస్తున్నారట. అయితే అక్కడ ఎక్కువ మందికి కరోనా లక్షణాలు లేకుండానే పాజిటివ్ గా నమోదవుతుంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మొత్తం మీద బయటకి లక్షణాలు కనిపించని కేసులే ఎక్కువ కనిపిస్తున్నాయట. అత్యధికంగా వుహాన్ లో లక్షణాలు లేకుండా వైరస్ వ్యాప్తి చెందుతుందని చైనా నేషనల్ హెల్త్ కమీషన్ తాజాగా తెలియచేసింది.

కరోనా వైరస్ సోకి తెలంగాణ పోలీస్ మృతి

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ముగిసిన సినీ ప్రముఖుల భేటీ.. వాటికేం ఇబ్బంది లేదన్న మంత్రి..!