విదేశాలకు చెందిన అధ్యక్షులు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా హెలీకాఫ్టర్లను ఉపయోగించడానికి ఇష్టపడరు. వారు విమానంలో ప్రయాణించడానికి ఇష్టపడతారు. ఇక అలానే మహాబలిపురంలో మోదీతో సమావేశమైన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా చైనా నుంచి నేరుగా చెన్నై విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి అతడు మహాబలిపురం చేరుకోవడానికి హెలికాఫ్టర్ అందుబాటులో ఉంచినా సున్నితంగా తిరస్కరించి తన శత్రుదుర్బేధ్యమైన “హ్యాంగ్ కీ” కారులో దాదాపుగా 57 కిలోమీటర్లు పర్యటించారు.

జిన్ పింగ్ చెన్నై వచ్చే రెండు రోజులు ముందే చైనా నుంచి నాలుగు కారులు కార్గోలో వచ్చాయి. భారత్ లో అతడి కారులలో తప్ప మిగతా వాటిలో ప్రయాణించడట. ఇక చైనా అధ్యక్షుడు కారులో మహాబలిపురం చేరుకుంటే, భారత్ ప్రధాని మోదీ హెలీకాఫ్టర్లో అక్కడకి చేరుకున్నారు.

వాతావరణం అనుకూలంగా లేని సమయాలలో హెలికాఫ్టర్ లో ప్రయాణించడం అంతా శ్రేయస్కరం కాదు. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఇలానే రచ్చబండ కార్యక్రమానికి వెళ్లి హెలికాఫ్టర్ కూలిపోవడంతో చనిపోయారు. ఇక మహాబలిపురం అక్కడ ఆలయాల ప్రతిష్టతను తెలియచేసి అక్కడి సంప్రదాయ దుస్తులు అయిన పంచె కట్టి వివరించారు. రెండు దేశాలకు సంబంధించిన పలు కీలకమైన విషయాలను చర్చించడం జరిగింది.