చైనాకు చెందిన యువ శాస్త్రవేత్త అమెరికాలోని పెన్సిల్వేనియాలో దారుణ హత్యకు గురయ్యాడు. కరోనా వైరస్ పై పరిశోధనలు చేస్తున్న చైనా సైంటిస్టు బింగ్ లియు (37) రెండు రోజుల క్రితం తన ఇంట్లో చనిపోయి ఉన్నాడు. ఇక అతనితో పాటు హోగూ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా చనిపోయి ఉన్నాడు. బింగ్‌ లియు మీద, తల భాగంలో తీవ్ర గాయాలున్నాయి. అయితే ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

బింగ్‌ పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో ప్రోఫీసర్ గా చేస్తున్నాడు. అయితే బింగ్ లియు, హోగూ మంచి స్నేహితులు. కాగా బింగ్ లియుని మొదట హోగు కాల్చి చంపి తరువాత తనకు తానూ కాల్చుకుని చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇక బింగ్ లియు చేస్తున్న పరిశోధనలకు ఈ హత్యకు ఏమైనా సంభందం ఉందేమోనన్న కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించిన సీఎం జగన్..!

గ్యాస్ లీక్ కావడానికి అదే ప్రధాన కారణం.. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వివరాలు..!