చైనాలో నింజియాంగ్‌లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 23 ఏళ్ళ యువతీ మెదడులో 10 సెంటీమీటర్ల పొడవైన నులిపురుగు బయట పడింది. నింజియాంగ్ చెందిన క్షియావో ఇ యువతీ గత కొద్ది రోజులుగా తలనొప్పితో భాదపడుతుంది. ఈ మధ్య ఆమెకు న్యూరలాజికల్‌ డిజార్డర్ ఎటాక్ చేయడంతో ఆస్పత్రిలో చేరింది.

క్షియావోకు పరీక్షలు జరిపిన డాక్టర్లు ఆమె మెదడులో ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. ఇక వెంటనే శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు.. ఆమె మెదడులో ఉన్న 10 సెంటీమీటర్ల నులిపురుగును గుర్తించి బయటకి తీశారు. సరిగా ఉడకని మాంసం తిన్నందువల్లే ఆమె మెదడులోకి నులిపురుగు చేరినట్లు డాక్టర్లు తెలియచేసారు. ఇక ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు డాక్టర్లు తెలియచేసారు.

ఈరోజు నుండి మొదలైన ఆన్లైన్ ఆర్డర్స్..!

ఈరోజు ఏపీలో నెలకొన్న పరిస్థితులతో తెలంగాణ సర్కార్ మేల్కొనక తప్పదు

డ్రాగన్ దేశం అందుకే ఆ నిజాన్ని దాచిందట..!

కరోనా మరణాలకు అసలు కారణం తెలియచేసిన భారత సంతతికి చెందిన బ్రిటన్ వైద్యుడు ..!