దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అతని మాట తీరుతో పాటు, అతని ప్రవర్తన చూసి గత ఐదేళ్లలో ఎంత మంది అధికారులు, ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డారో లెక్కేలేదు. ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు రావడానికి చింతమనేని ప్రభాకర్ తీరే నిదర్శనం. అతడి వర్గీయులతో పాటు అతడు ఎమ్ఆర్ఓ వనజాక్షిని జుట్టు పట్టుకొని ఇసుకలో లాక్కెళ్లారన్న సంఘటనతో అప్పట్లో సంచలనం కలిగించి. ఆ సంఘటనలో హైకోర్టు అక్షింతలు వేస్తే తప్ప ప్రభుత్వం కేసు నమోదు చేయలేకపోయింది.

ఇక వైసీపీ ప్రభుత్వం రావడంతో పాటు దెందులూరులో చింతమనేని చేసిన అరాచకాలకు అతడిపై వైసీపీ యువ నాయకుడు అబ్బయ్య చౌదరి మంచి మెజారిటీతో విజయం సాధించాడు. ఇక అక్కడే చింతనేని అదృష్టం తిరగపడింది. ఇప్పటి వరకు ఏ అధికారం చూసుకొని ప్రజలతో పాటు ప్రభుత్వాధికారులపై విరుచుకుపడ్డాడో అదే చింతమనేనికి ప్రభుత్వం మారడంతో దైర్యంగా కేసులు పెట్టడానికి అందరూ ముందుకు రావడంతో అతడిని రిమాండ్ మీద జైలుకు పంపించారు.

అతడిని రిమాండ్ మీద కోర్ట్ నుంచి తీసుకొని వెళుతుండగా ఒక పోలీస్ అధికారి చింతమనేనిని పట్టుకున్నాడని “చెయ్యి వదులు ఏమిటి మీద చెయ్యి వేస్తున్నావ్” అనేలా మాట్లాడటంతో జైలులో ఉన్నా ఇంకా తగ్గలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు చింతమనేని తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక చింతమనేని దాదాపుగా నెల రోజులు తప్పించుకొని తిరిగినా ఎట్టకేలకు పట్టుకున్నారు.

ఆ తరువాత అసలు కథ మొదలైంది. ముందు ఒక కేసు మీద జైలుకు పంపించారు, ఆ తరువాత వరుస పెట్టి కేసులు పెడుతున్నారు… రిమాండ్ పెంచుతున్నారు… కేసులు పెడుతున్నారు… రిమాండ్ పెంచుతున్నారు… ఇలా చెప్పుకుంటూ పోతే… ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే పరిస్థితి ఏమిటంటారు… అతడి మీద దాదాపుగా 50 కేసులు ఉన్నాయని చెబుతున్నారు… రిమాండులతోనే అతడు జైలులో కొన్ని నెలలు ఉండవలసి ఉంటుంది.

ఈరోజు మాజీ సర్పంచ్ కృష్ణారావును చిత్ర హింసలు పెట్టాడన్న కేసులో చింతమనేనిని కోర్ట్ లో ప్రవేశపెట్టారు. పిటిషన్ విచారించిన కోర్ట్ అక్టోబర్ 23 వరకు రిమాండ్ విధించింది. ఇక ఆ లోపు మరొక కేసు తెర మీదకు వస్తుంది. ఈ దెబ్బతో చింతమనేని బయటకు ఎప్పుడు వస్తాడా అని తెలుగుదేశం కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఇన్ని కేసుల మధ్యలో ఏదైనా ఒక్క కేసులో శిక్ష పడినా చింతమనేని పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. అతడు చేసిన తప్పులకు అతడే మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.