మెగాస్టార్ చిరంజీవి ఓ సంచలన దర్శకుడితో సినిమా తీయబోతున్నారని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ కాంబినేషన్ లో ‘ఆచార్య’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, మాగ్నా ఎంటర్టైమెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా తరువాత మెగాస్టార్ సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారట. ఈ సినిమాపై తొలి దశలో చర్చలు జరుగుతున్నాయని.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది. ఓ భారీ పాన్ ఇండియా మూవీ గా దీన్ని తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతవరకు ఒక సినిమా కూడా రాలేదు. మొదటి సారి సినిమా రాబోతుండడంపై అభిమానుల్లో ఆసక్తికరంగా ఉంది.

ప్రైవేటు పాఠశాలల్లో 50 శాతం ఫీజులే..!

విశాఖ ఘటన మరువక ముందే మరో చోట గ్యాస్ లీకేజ్ కలకలం.. ముగ్గురు పరిస్థితి విషమం..!