2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు హిందుపూర్ లో లేపాక్షి ఉత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని పిలవడానికి బాలకృష్ణ అమరావతి వెళ్లిన సమయంలో ఇండస్ట్రీ నుంచి చిరంజీవిని పిలుస్తున్నారా అని అడిగితే, పిలవలేదు… పిలవను కూడా అంటూ పొగరుగా సమాధానం చెబుతూ… తనకు ఎవరని పిలవాలో తెలుసునని, ఎవర్ని పడితే వారిని నెత్తికి ఎక్కించుకొనని, నేను ఒక డిక్టేటర్ ను అని తన పద్ధతిలోనే ముందుకు వెళ్తానని ఎటకారంగా చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడారు.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో 2009 ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా కొంతమందికి మా నాన్నగారు పార్టీ పెట్టి మూడు నెలలకే ముఖ్యమంత్రి అయినట్లు అవ్వాలని కలలు కంటున్నారని, కొందరు మా నాన్నలా చరిత్ర సృష్టించాలని మిడిసిపడుతున్నారని, చరిత్రంటే మాదే, చరిత్ర సృష్టించాలన్నా మేమె తిరగ రాయాలన్నా మేమే అంటూ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం కలిగించాయి.

ఇలా బాలకృష్ణ ఇష్టానుసారంగా మాట్లాడుతూ, అక్కినేని నాగార్జునతో కూడా ఏదో లొల్లి పెట్టుకోవడంతో సినీ పరిశ్రమ మొత్తం ఎక్కువగా చిరంజీవి పక్కన ఉండటంతో కావాలనే బాలకృష్ణను గిల్లినట్లు తెలుస్తుంది. బాలకృష్ణ చేస్తే తప్పు… చిరంజీవి చేస్తే తప్పు లేదా? టైమ్ ఎప్పుడు ఒకరికే నడవదు… ప్రతి ఒక్కరకి టైమ్ వస్తుంది. చిరంజీవికి టైమ్ వచ్చింది వాడేశారు.

కానీ దాన్ని బాలకృష్ణ తట్టుకోలేక కోపంతో అభిమానులను కొట్టినట్లు ఇష్టానుసారంగా ఎప్పుడు శాంతంగా ఉండే చిరంజీవి లాంటి అగ్రహీరోపై వ్యాఖ్యలు చేస్తే ఊరుకోవడానికి ఎవరు ఖాళీగా లేరని సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. చాల రోజులుగా చిరంజీవి – బాలయ్య అభిమానులు గొడవలు సద్దుమణిగినట్లు కనపడినా ఇప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యలతో మరొకసారి రచ్చకెక్కాయి.

మెగా బ్రదర్ నాగబాబు కొద్ది సేపటి క్రితం వీరావేశంతో బాలకృష్ణను ఉద్దేశించి సినీ పరిశ్రమతో పాటు తెలంగాణ ప్రభుత్వాన్ని క్షమాపణ చెప్పాలని, మీరు ఏపీ ప్రజలను ఎలా దోచుకున్నారో చెప్పడం మొదలెడితే తలెక్కడ పెట్టుకుంటారని బాలకృష్ణను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు ఈ గొడవ ఇంకెంత దూరం పోతుందో చూడాలి.

బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదన్న నాగబాబు

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కరోనాపై సినిమా, 40 శాతం షూటింగ్ పూర్తి