మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు కావడంతో తెలుగు ఇండస్ట్రీ జనంతో పాటు అతడి అభిమానులు అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి కూడా నితిన్ కు పుట్టినరోజు శుభకాంక్షలు చెబుతూ నువ్వు ఒక యుద్ధ వీరుడివి వ్యక్తిగత కారణాల కన్నా ప్రజల శ్రేయస్సు ముఖ్యమనుకున్నావ్… కాబట్టే నీ పెళ్లిని వాయిదా వేసుకుని కరోనా వైరస్ వలన బాధపడుతున్న వారిని ఆదుకోవాలని కోరుతున్నవని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని నువ్వు పెళ్లి వాయిదా వేసుకోవడం గొప్ప నిర్ణయమని అన్నారు.

ఇక తెలుగు ఇండస్ట్రీలో కరోనా వైరస్ బారిన పడిన వారిని ఆదుకోవడంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తన వంతుగా నితిన్ 20 లక్షల సహాయం అందచేసాడు. అతడు సాయం చేసిన తరువాత వరుస పెట్టి హీరోలందరూ విరాళం ఇవ్వడం మొదలుపెట్టారు. నితిన్ గత ఆరేళ్లుగా ప్రేమిస్తున్న షాలినితో ఏప్రిల్ 16 దుబాయ్ లో పెళ్లి జరగవలసి ఉండగా కరోనా వైరస్ వలన వాయిదా వేసుకోవడం జరిగింది. ఈరోజు నితిన్ పుట్టినరోజు సందర్భంగా అతడి కొత్త సినిమా “రంగ్ దే”కు సంబందయించి చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్ విడుదల చేసింది. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు.