మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా ముగించుకొని త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక కొరటాల శివ సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందు ఆయుర్వేద వైద్యంతో తన శరీరాన్ని ఫిట్ గా చేసుకోవడానికి వైజాగ్ వెళ్తున్నారట. సైరా సినిమాకు సంబంధించి చిరంజీవి కొంత బరువు పెరిగిన సంగతి తెలిసిందే. సినిమాలోని తన పాత్రకు సంబంధించి అలా పెరగడంతో, ఇప్పుడు కొరటాల శివ సినిమాలో కొంత స్లిమ్ లుక్ తో కనపడవలసిన పరిస్థితి రావడంతో చిరంజీవి “బే లీఫ్ ఆయుర్వేద స్పా” వైజాగ్ నందు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

సినీ పరిశ్రమకు సంబంధించి చాల మంది ఇదే ఆయుర్వేద స్పా ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటారట. దాదాపుగా చిరంజీవి కూడా ఆయుర్వేదిక స్పాలో 10 రోజులు గడపనునట్లు తెలుస్తుంది. ఇప్పటికే సైరా సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉండటంతో పాటు వచ్చే సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాత రామ్ చరణ్ సన్నాహాలు చేస్తున్నారు.